లవర్ బోయ్ కాదు.. ఫైటర్ బోయ్ అఖిల్ | Sakshi
Sakshi News home page

లవర్ బోయ్ కాదు.. ఫైటర్ బోయ్ అఖిల్

Published Sat, Aug 29 2015 6:49 PM

లవర్ బోయ్ కాదు.. ఫైటర్ బోయ్ అఖిల్

ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. అక్కినేని వంశంలో మూడో తరానికి చెందిన మరో హీరో తెరంగేట్రం చేసేశాడు. అఖిల్ హీరోగా.. అదే పేరుతో వస్తున్న సినిమా టీజర్ విడుదలైంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ స్వయంగా వచ్చి ఈ టీజర్ విడుదల చేయడంతో అఖిల్ ఆనందానికి అంతులేదు. లవ్లీబోయ్లా కనిపించే అఖిల్ను మొదటి సినిమాలోనే తనదైన శైలిలో యాక్షన్ సన్నివేశాలతో పరిచయం చేశాడు దర్శకుడు వీవీ వినాయక్.

చార్మినార్ నేపథ్యంలోను, వేరే లొకేషన్లలో అఖిల్ ఫైట్ సీన్లు, లోతుగా నీళ్లలోకి దూకే సన్నివేశాల్లాంటివి ఈ టీజర్లో ఉన్నాయి. నల్లటి టీషర్టు, దానిమీద నల్ల జర్కిన్, చేతులకు కూడా నల్లటి బ్యాండు ధరించి.. ఫైటర్ మూడ్లో ఇందులో అఖిల్ కనిపిస్తాడు. ఘనమైన వారసత్వాన్ని అందించినందుకు అక్కినేని నాగేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఒక నిమిషం పాటు ఈ టీజర్ సాగింది. ఫైటులో అఖిల్ దెబ్బ తింటూ వెనక్కి పడటం ఈ టీజర్లో మొదటి సన్నివేశం. ఫెన్సింగ్ మీద నుంచి కారు మీదకు దూకడం, పాతబస్తీలో సాగే స్ట్రీట్ ఫైట్లు.. ఇలాంటివన్నీ ఈ ఒక నిమిషం లోపు ఉండే టీజర్లో చూపించారు. దీన్ని బట్టే అఖిల్ మొదటి సినిమా ఏ రేంజిలో ఉంటుందనే ఆసక్తి కలిగించారు.

 

Advertisement
 
Advertisement