మోగిన సంగీత సిరిమువ్వలు | Sakshi
Sakshi News home page

మోగిన సంగీత సిరిమువ్వలు

Published Thu, May 23 2024 5:20 AM

మోగిన

చిలకలూరిపేట: కళానిలయం 39వ జాతీయస్థాయి నవరస శాసీ్త్రయ, జానపద, సంగీత నాట్య కళారూపాల పోటీలు బుధవారం రెండోరోజు వైభవంగా సాగాయి. పోటీలకు వేదికై న పట్టణంలోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆర్యవైశ్య కల్యాణ మండపంలో భరతనాట్యం, కూచిపూడి పోటీలు అట్టహాసంగా సాగాయి. చంద్ర, సూర్య విభాగాలలో కళాకారిణులు సత్తాచాటారు. కళాప్రియులకు సంగీత సిరిమువ్వల మాధుర్యాన్ని పంచారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు కాళ్లకు గజ్జెలు కట్టి, చక్కటి హావభావాలతో పోటాపోటీగా ప్రతిభ చూపారు. కీర్తన, మూషికవాహన, గణపతికౌతం, వినాయకకౌతం, ముద్దుగారే యశోద, బాలగోపాల తరంగం, బ్రహ్మాంజలి, దశావతారశబ్దం, జనుతశబ్దం, కొండలలో నెలకొన్న, భామాకలాపం, నరసింహవైభవం, హిమగిరి తనయ, అలవేల్‌ మంగ వంటి పాటలకు లయబద్ధంగా నర్తించారు. ప్రేక్షకులను రంజింపచేశారు. కరతాళధ్వనులు అందుకున్నారు. ఓ వైపు పోటీలు కొనసాగిస్తూనే మరోవైపు నాట్యాచార్యులను సన్మానించారు. ముందుగా కళానిలయం నిర్వాహకుడు ప్రగడ రాజమోహనరావు సతీమణి ప్రగడ శివసత్యనారాయణమ్మ జ్యోతి ప్రజ్వలన చేసి పూజ నిర్వహించారు.

నేటికార్యక్రమాలు

కళానిలయం 39వ జాతీయస్థాయి నవరస శాసీ్త్రయ, జానపద, సంగీత నాట్య కళారూపాల పోటీలలో భాగంగా గురువారం చంద్ర, సూర్య విభాగాల్లో జానపద నృత్య పోటీలతోపాటు శాసీ్త్రయ జంటనాట్యాలు, శాసీ్త్రయ బృంద నాట్యాలు, శాసీ్త్రయం కాని బృంద నాట్యాలు, శాసీ్త్రయ నృత్య నాటికల పోటీలు నిర్వహిస్తారు. వీటితోపాటు నాట్యాచార్యులకు సన్మాన కార్యక్రమాలు ఉంటాయి.

రెండోరోజూ వైభవంగా

సంగీత నాట్య పోటీలు

ప్రతిభతో అబ్బుర పరిచిన కళాకారిణులు

మోగిన సంగీత సిరిమువ్వలు
1/3

మోగిన సంగీత సిరిమువ్వలు

మోగిన సంగీత సిరిమువ్వలు
2/3

మోగిన సంగీత సిరిమువ్వలు

మోగిన సంగీత సిరిమువ్వలు
3/3

మోగిన సంగీత సిరిమువ్వలు

Advertisement
 
Advertisement
 
Advertisement