టైటానిక్@2018 | Sakshi
Sakshi News home page

టైటానిక్@2018

Published Sat, Feb 13 2016 3:34 AM

టైటానిక్@2018

టైటానిక్.. ఓ అమర ప్రేమ గాథ.. సినిమా స్టోరీ సంగతి పక్కనపెడితే.. సినిమా పుణ్యమానీ మన దగ్గర పల్లెటూర్లలో సైతం టైటానిక్ షిప్ ఫేమస్ అయిపోయింది. ప్రపంచంలోనే అత్యంత ప్రాముఖ్యం కలిగిన షిప్‌గా పేరొందింది. 1912లో మునిగిపోయిన ఈ నౌకలాంటిదాన్నే మళ్లీ నిర్మిస్తామంటూ ఆస్ట్రేలియాకు చెందిన సంపన్నుడు, బ్లూస్టార్‌లైన్ అధినేత క్లైవ్ పామర్ 2012లో ప్రకటించారు. 2016 సరికి టైటానిక్-2 నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పారు.

తాజాగా తెలిసిన విషయమేమిటంటే.. నౌక నిర్మాణం మరింత ఆలస్యం కానుంది. టైటానిక్-2 2018లో అందుబాటులోకి వస్తుందని.. అదే ఏడాది చైనాలోని జియాంగ్సూ నుంచి దుబాయ్‌కు తన తొలి ప్రయాణాన్ని మొదలుపెడుతుందని బ్లూస్టార్‌లైన్ ప్రతినిధి తెలిపారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం నౌకల్లో రోబో బార్‌టెండర్లు వంటి అత్యాధునిక సదుపాయాలెన్నో అందుబాటులోకి వచ్చాయి. టైటానిక్-2లో రక్షణ సదుపాయాల విషయంలో మాత్రమే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోనున్నారు. మిగతావన్నీ అచ్చంగా పాత టైటానిక్‌లో ఉన్నట్లుగానే ఉంటాయని చెబుతున్నారు. పాతదానిలో ఉన్నట్లుగానే కొత్త టైటానిక్‌లోనూ మొదటి, రెండు, మూడో తరగతి క్యాబిన్లు ఉంటాయట. అయితే.. పాత టైటానిక్ తరహాలో కాకుండా.. ఇక్కడ లైఫ్‌బోట్లు ప్రతి ఒక్కరికీ ఉంటాయంటున్నారు. ఇంతకీ టైటానిక్-2 ఎలా ఉండబోతోంది?

Advertisement

తప్పక చదవండి

Advertisement