రుణమాఫీపై డ్రామాలు ఎందుకు? | Sakshi
Sakshi News home page

రుణమాఫీపై డ్రామాలు ఎందుకు?

Published Wed, Aug 13 2014 1:33 AM

రుణమాఫీపై డ్రామాలు ఎందుకు? - Sakshi

సాలూరు:ఎన్నికల్లో రైతులు, డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తామన్న టీడీపీ నాయకులు ఇప్పుడు మాఫీ విషయంలో డ్రామాలు ఆడడం సరికాదని సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర అన్నారు. మంగళవారం ఆయన స్థానిక ఏడీఏ కార్యాలయం వద్ద పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుణమాఫీపై పాలకులు రోజుకో విధంగా మాట్లాడుతున్నారన్నారు. రీషెడ్యూల్ చేసినా కొత్తగా రైతులకు రుణాలు మంజూరు కావన్నారు. ప్రభుత్వం తీరు వల్ల రైతులు పెట్టుబడుల కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నార న్నారు.
 
 చంద్రబాబు హామీ ఇచ్చినట్టుగా పంట రుణాలను మాఫీ చేసి కొత్త రుణా లు అందేలా చేస్తేనే రైతులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి వరుణుడు రావొద్దన్న ఫైల్‌పై సంతకం చేయడంతోనే వర్షా లు పడడం లేదని ఎద్దేవా చేసారు. ఏడీఏ వెంకటయ్య మాట్లాడుతూ పొలం పిలుస్తోంది కార్యక్రమం ద్వారా ప్రతి మంగళ, బుధవారాల్లో వ్యవసాయ శాఖాధికారులు పొలాల్లో పర్యటించి రైతులకు సూచనలు, సలహాలు ఇస్తారన్నారు. అనంతరం మండలంలోని శివరాంపురం, చంద్రపువలస గ్రామా ల పరిధిలోని పొలాల్లో పర్యటించారు.ఈ కార్యక్రమంలో పాచిపెంట మం డల వైస్ ఎంపీపీ టి.గౌరీశ్వరరావు, ఏఓ అనురాధ, ఏఈఓలు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement