Breaking News

నిర్మాతగా మారడానికి ఇదే సరైన కథ! – అవికా గోర్‌

Published on Fri, 02/10/2023 - 01:00

‘‘నిర్మాతని కావాలని నా 21వ ఏటనే అనుకున్నాను.. నిర్మాతగా మారడానికి ‘పాప్ కార్న్’ సరైన కథ. అందుకే ఈ చిత్రంతో తొలి అడుగు వేశాను’’ అని అవికా గోర్‌ అన్నారు. సాయి రోనక్‌ హీరోగా మురళి గంధం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పాప్ కార్న్’. ఈ చిత్రంలో అవికా గోర్‌ హీరోయిన్‌గా నటించడంతో ΄ాటు నిర్మాతగా (సహ నిర్మాత) మారారు. ఎంఎస్‌ చలపతి రాజు సమర్పణలో భోగేంద్ర గుప్త నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా అవికా గోర్‌ చెప్పిన విశేషాలు.

డైరెక్టర్‌ మురళి చెప్పిన ‘పాప్ కార్న్’ కథ ఆసక్తిగా అనిపించింది. 90 శాతం లిఫ్ట్‌లో జరిగే కథ ఇది. ఇప్పుడు ఆడియెన్స్ కి మంచి కంటెంట్‌ లేదా మాస్‌ మసాలా కావాలి. ఆ రెంటినీ బ్యాలన్స్ చేస్తూ ‘పాప్ కార్న్’ తీశారు మురళి.

చిత్రపరిశ్రమలో నాకు గాడ్‌ఫాదర్స్‌ లేరు. అందుకే నేను నిర్మాతగా చేస్తానని చెప్పగానే ముందు సందేహం వ్యక్తం చేశారు మా పేరెంట్స్‌. కానీ, ఇది నా కల అని చెప్పగానే వాళ్లు ఒప్పుకున్నారు. నిర్మాతగా సినిమా ఎలా వస్తోంది? ఎలా ప్రమోట్‌  చేయాలి? అని ఆలోచించడం కొత్తగా అనిపించింది. నాప్రొడక్షన్  హౌస్‌లో మరో సినిమా షూటింగ్‌ చేశాం. అలాగే ఇంకో మూవీ ప్రీప్రొడక్షన్ జరుగుతోంది.

ప్రస్తుతం తెలుగులో కొన్ని సినిమాలు చేస్తున్నాను. ‘1920’ అనే చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెడుతున్నాను.

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)