మృత్యువుతో పోరాడి ఓడిన యువ డాక్టర్‌

Published on Thu, 01/22/2026 - 11:44

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): డాక్టర్‌ అయిన బిడ్డను చూసి ఆ తల్లిదండ్రులు పడ్డ సంతోషం మూన్నాళ్లకే ఆవిరైంది. ఎండీ కోర్సు చదువుతున్న యువడాక్టర్‌ గుండెపోటుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచింది. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన మోతె ప్రేమ్‌కుమార్‌–యశోద దంపతుల పెద్ద కుమార్తే రోస్లిన్‌(27) రష్యాలో ఎంబీబీఎస్‌ పూర్తిచేసింది. కొంతకాలం సిరిసిల్ల ఏరియా ఆస్పత్రి, ఎల్లారెడ్డిపేట పీహెచ్‌సీలో వైద్యసేవలు అందించింది. ఎంబీబీఎస్‌ చదువుతున్న సమయంలోనే రాజన్నపేటకు చెందిన సాయిబాబాను ప్రేమవివాహం చేసుకుంది. 

అనంతరం హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్‌ కళాశాలలో ఎండీ కోర్సు సెకండియర్‌ చదువుతుంది. ఇంతలోనే గర్భం దాల్చింది. అయితే గత డిసెంబర్‌లో తీవ్ర జ్వరంతో ఇంటికొచ్చి మందులు వాడింది. అదే నెల 24న ఇంట్లో హఠాత్తుగా ఊపిరి ఆగిపోవడంతో వెంటనే సీపీఆర్‌ చేసి స్థానిక ప్రైవేట్‌ హాస్పిటల్‌కు, అక్కడి నుంచి హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. అక్కడ 4 రోజులు చికిత్స అందించారు. సుమారు రూ.7లక్షల వరకు ఖర్చు చేశారు. రికవరీ కాకపోవడంతో తిరిగి ఎల్లారెడ్డిపేటకు తీసుకొచ్చి చికిత్స అందించారు. మళ్లీ హైదరాబాద్‌లోని మరో హాస్పిటల్లో చేర్పించారు. 27 రోజులపాటు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)