Breaking News

పరువు పోతుందని...

Published on Tue, 09/10/2024 - 07:38

జీడిమెట్ల: దొంగతనంలో కీలక పాత్ర పోషించాడు.. ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డాడు.. ఇంటి యజమానితో మంచిగా ఉంటూనే దొంగతనం చేసిన వ్యక్తికి పోలీసుల కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాడు. తీరా పోలీసులకు అసలు విషయం తెలిసిపోవడంతో పరువు పోయిందని ఓ వైపు, డబ్బులు కట్టాలంటూ యజమాని ఒత్తిడి చేయడంతో ఓ యువకుడు ఉరి వేసుకుని అత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.. వివరాల్లోకి వెళితే రాజస్ధాన్‌కు చెందిన హనుమాన్‌రాం కుత్బుల్లాపూర్‌ విలేజ్‌లో స్టీల్‌ సామాన్ల దుకాణం నిర్వహిస్తున్నాడు. 

ఈనెల 3న అతడి ఇంట్లో రూ.14లక్షలు చోరీకి గురయ్యాయి. డూప్లికేట్‌ కీతో  బీరువా తెరిచి చోరీకి పాల్పడినట్లు గుర్తించాడు. దీంతో అతను తన దుకాణంలో పనిచేసే కిషన్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా కిషన్, రాంలాల్‌ ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. గుర్తించారు. దీంతో దొంగలను పట్టుకునేందుకు పోలీసులు బాధితుడు హనుమాన్‌రాంతో పాటు అతడిని పనికి కుదిర్చిన అశోక్‌తో సహా రాజస్థాన్‌ బయలుదేరారు.

 ఈ క్రమంలో అశోక్‌ పోలీసుల కదలికలపై కిషన్, రాంలాల్‌లకు ఎప్పటికప్పుడు వాట్సప్‌ కాల్స్, మేసేజ్‌ల ద్వారా సమాచారాన్ని అందించాడు. దీంతో అప్రమత్తమైన వారు అక్కడి నుంచి పరారయ్యారు. కిషన్‌ తల్లిదండ్రుల ద్వారా కిషన్‌ను ఇంటికి రప్పించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌ తీసుకువచ్చారు కాగా రాంలాల్‌ పరారీలో ఉన్నాడు. కిష నుంచి రూ.2.70లక్షలు స్వా«దీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. 

విషమంగా అశోక్‌ ఆరోగ్యం... 
అశోక్‌కు తెలిసే ఈ చోరీ జరిగినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో బాధితుడు హనుమాన్‌రాం కిషన్‌ను పనిలో కుదిర్చినందుకు చోరీకి గురైన సొమ్ము కట్టాలంటూ అశోక్‌పై ఒత్తిడి చేశాడు. దీంతో ఆందోళనకు గురైన అశోక్‌ ఆదివారం ఉదయం జేకేనగర్‌లోని  తన ఇంట్లో ఉరి వేసుకున్నాడు.దీనిని గుర్తించిన కుటుంబ సభ్యులు అతడిని సమీపంలోని అజూదా అస్పత్రికి తరలించారు. అశోక్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో  వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. కాగా అశోక్‌ కుటుంబ సభ్యులు అత్మహత్యాయత్నానికి కారణం హనుమాన్‌రాం అని పేర్కొంటూ పేట్‌బïÙరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడమేగా గాక తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట బైటాయించారు.

అశోక్‌ను ఇంటరాగేట్‌ చేయలేదు
ఈ విషయమై ఇన్‌స్పెక్టర్‌ మల్లేష్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా అశోక్‌ను పోలీసులు కొట్టినందునే అతను అత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని వచి్చన కథనాలు పచ్చి అబద్ధమన్నారు. అనుమానం ఉంటే పోలీస్‌స్టేషన్‌లోని సీసీ పుటేజీలు పరిశీలించుకోవచ్చునని తెలిపారు.  

#

Tags : 1

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)