Breaking News

ఎడారి దేశంలో దారుణం

Published on Thu, 07/09/2026 - 04:20

డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్‌): ఉపాధి కోసం ఎడారి దేశానికి వలస వెళ్లిన ఓ యువకుడు శవమై కనిపించాడు. ఘటనకు సంబంధించి కువైట్‌ పోలీసులు ఒకరిని అరెస్ట్‌ చేశారు. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలం కోరట్‌పల్లి తండాకు చెందిన గుగులోత్‌ కైలాశ్‌ (29) మెకానికల్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీ పూర్తి చేసి 2021లో కువైట్‌కు వెళ్లాడు. అక్కడి ఓ కంపెనీలో సీనియర్‌ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. 

మార్చి 19న డిచ్‌పల్లి మండల పరిధిలోని మేలయతండాకు చెందిన గణేశ్‌.. కైలాశ్‌ వద్దకు వెళ్లి వాహనం రిపేర్‌ చేయాలని తీసుకెళ్లాడు.కైలాశ్‌ తిరిగి రాకపోవడం, ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ రావడంతో అక్కడే ఉన్న అతడి పెదనాన్న కుమారులు గణేశ్‌ను కలిసి ఆరా తీశారు. వాహనం రిపేర్‌ కాకపోవడంతో కైలాశ్‌ను తీసుకొచ్చి రూమ్‌కు కొద్దిదూరంలో దింపి వెళ్లినట్లు అతడు సమాధానం ఇచ్చాడు. కైలాశ్‌ ఆచూకీ లభించకపోవడంతో వారు కువైట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలించగా.. ఎడారి వైపు వెళ్లేటప్పుడు కారులో ఇద్దరు వెళ్లడం, తిరిగి వచ్చేటప్పుడు కేవలం ఒకరు మాత్రమే రావడం గమనించారు. నిందితుల్లో ఒకరైన కార్తీక్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. క్రేన్‌ ప్రమాదంలో కైలాశ్‌ చనిపోయాడని, పోలీసు కేసు భయంతో తాను, తన తండ్రి కలిసి శవాన్ని అక్కడే ఇసుకలో పాతిపెట్టామని చెప్పాడు.  

హతుడి ఇంటికి వెళ్లిన మరో నిందితుడు..
కైలాశ్‌ మృతదేహాన్ని పూడ్చిపెట్టిన తర్వాత.. మరో నిందితుడు గణేశ్‌ సౌదీ అరేబియా మీదుగా భారత్‌కు చేరుకున్నాడు. నెలక్రితం కొరట్‌పల్లి తండాకు వెళ్లి కైలాశ్‌ తల్లిదండ్రులను కలిశాడు. కైలాశ్‌ ఆచూకీ తెలిసిందా అంటూ ఆరా తీశాడు. మంగళవా రం కువైట్‌లో కైలాశ్‌ మృతదేహాన్ని పోలీసులు బయటకు తీ సి, తన కుమారుడిని అదుపులోకి తీసుకున్న విషయం తెలియగానే గణేశ్‌ తమ గ్రామం నుంచి పరారయ్యాడు. దీంతో కైలాశ్‌ కుటుంబ సభ్యులు డిచ్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఆరు నెలల క్రితం ఎంగేజ్‌మెంట్‌..: మృతుడు గుగులోత్‌ కైలాశ్‌కు ఆరు నెలల క్రితం ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. గత నెలలోనే పెళ్లి జరగాల్సి ఉంది. అయితే ఆచూకీ తెలియకుండా పోవడంతో పెళ్లి వాయిదా పడింది. తమ కుమారుడు ఇంటికి తిరిగి వస్తా డని నాలుగు నెలలు గా ఎదురు చూస్తు న్న తల్లిదండ్రులకు మృతి చెందాడని తెలియడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)