Breaking News

పెళ్లి కుదరడంలేదని యువకుడి బలవన్మరణం

Published on Sat, 03/15/2025 - 12:59

చిన్నశంకరంపేట(మెదక్‌): ఉరేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిన్నశంకరంపేట మండలం మడూర్‌ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ నారాయణ గౌడ్‌ కథనం మేరకు.. మండలంలోని మడూర్‌ గ్రామానికి చెందిన శివరాజ్‌(24)కు కొద్ది రోజులుగా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కానీ ఎక్కడా సంబంధం కుదరడంలేదు. దీంతో మానోవేదనకు గురయ్యాడు. గురువారం రాత్రి పొలం వద్దకు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. 

అర్థరాత్రి అవుతున్నా ఇంటికి రాకపోవడంతో తండ్రి యాదగిరి, మరో రైతు సత్యనారాయణతో కలిసి పొలం వద్దకు వెళ్లి చూశారు. అప్పటికే పొలం వద్ద చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో తండ్రి యాదగిరి శుక్రవారం పోలీస్‌లకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. 

భార్యతో గొడవపడి భర్త.. 
పటాన్‌చెరు టౌన్‌: భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన సుభాష్‌ సాకేత్‌(27) బతుకుదెరువు కోసం పటాన్‌చెరుకు వచ్చాడు. మండల పరిధిలోని పెద్ద కంజర్ల గ్రామంలో గల అరబిందో వెంచర్‌లో మేస్త్రీ వద్ద కూలీగా పని చేస్తూ అక్కడే షెడ్‌లో ఉంటున్నాడు. గురువారం రాత్రి ఫోన్‌లో భార్యతో గొడవ పడ్డాడు.

 ఈ క్రమంలో శుక్రవారం ఉదయం లేచి చూసేసరికి వెంచర్‌లోనే ఓ చెట్టుకు ఉరేసుకొని కనిపించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించి మృతుడి సోదరుడు విశాల్‌ ఇచి్చన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. 

#

Tags : 1

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)