Breaking News

బీఎండబ్ల్యూ కారు కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య

Published on Mon, 06/02/2025 - 08:27

జగదేవ్‌పూర్‌(గజ్వేల్‌): నచ్చిన కారు తండ్రి కొనివ్వడం లేదని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండలంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ చంద్రమోహన్, స్థానికుల కథనం మేరకు.. 

చాట్లపల్లి గ్రామానికి చెందిన బొమ్మ కనకయ్య దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడికి వివాహం కాగా చిన్న కుమారుడు జానీ(21)కి వివాహం కాలేదు. గ్రామంలో ఉంటూ వ్యవసాయం చేస్తున్నారు. కొద్ది రోజుల నుంచి జానీ తండ్రిని బీఎండబ్ల్యూ కారు కొనియాలని, లేకపోతే చనిపోతానని తరచూ గొడవ పడుతున్నాడు. మన ఆర్థిక పరిస్థితి సరిగా లేదని సముదాయించారు. అయినా జానీ ప్రవర్తనలో మార్పు రాలే దు. 30న సిద్దిపేటలో కారు షోరూమ్‌కు వెళ్లి మారుతీ స్విఫ్ట్‌ డిజైర్‌ కారును చూశారు. 

మారుతీ కారు తనకు వద్దని బీఎండబ్ల్యూ కారే కావాలని పట్టుబట్టి మనస్తాపానికి గురయ్యాడు. అదే రోజు సాయంత్రం వ్యవసాయ పొలం వద్ద పురుగు మందు తాగి అపస్మారకస్థితికి చేరుకున్నారు. వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆర్‌వీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు.

 

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)