Breaking News

మినీ సిలిండర్‌తో...

Published on Sat, 05/31/2025 - 07:06

రాజేంద్రనగర్‌(హైదరాబాద్): తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో పాటు తన భార్య తన నుంచి దూరమయ్యేందుకు కారణమని భావించిన ఓ యువకుడు మరో యువకుడిని మినీ సిలిండర్‌తో తలపై మోది హత్య చేసిన సంఘటన రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై మామిడి కిశోర్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాజేంద్రనగర్‌ బుద్వేల్‌ ప్రాంతానికి చెందిన సాయి కార్తీక్‌ (31), నవీన్‌  స్నేహితులు. ఇద్దరూ ఓ నెట్‌వర్క్‌ కంపెనీలో పని చేస్తూ అద్దె గదిలో ఉంటున్నారు. అదే ప్రాంతంలో సిద్ధార్థ్‌ రెడ్డి  తన భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. సిద్ధార్థ్‌ రెడ్డి ర్యాపిడో డ్రైవర్‌గా పని చేస్తూ జీవనం సాగించేవాడు. సిద్ధార్థ్‌ రెడ్డి, సాయి కార్తీక్, నవీన్‌లకు స్నేహం కుదిరింది. 

ఈ నేపథ్యంలో వ్యక్తిగత అవసరాల నిమిత్తం సాయి కార్తీక్‌ సిద్ధార్థ్‌ రెడ్డి నుంచి రూ. 8 లక్షలు అప్పు తీసుకున్నాడు.  డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా కాలయాపన చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సిద్ధార్థ్‌ రెడ్డి భార్య గత నెలలో అతడితో గొడవ పడి వెళ్లిపోయింది. సాయి కార్తీక్‌ ఇందుకు కారణమని సిద్ధార్థ్‌ రెడ్డి భావించాడు. గురువారం రాత్రి ముగ్గురు కలిసి సాయి కార్తీక్‌ రూమ్‌లో మద్యం తాగారు. ఈ సందర్భంగా సాయి కార్తీక్, సిద్ధార్థ్‌ రెడ్డి మధ్య మాట మాట పెరిగింది. దీంతో నవీన్‌ జోక్యం చేసుకుని వారికి నచ్చజెప్పాడు. ఆ తర్వాత ముగ్గురూ కలిసి మళ్లీ వైన్స్‌ షాప్‌ వద్దకు వెళ్లి మద్యం కొనుగోలు చేసి గదికి వచ్చి మద్యం తాగారు. 

అనంతరం మరోసారి సాయి కార్తీక్, సిద్ధార్థ్‌ రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నవీన్‌ సముదాయించేందుకు ప్రయతి్నంచగా సిద్ధార్థ్‌ రెడ్డి అతడిని బయటికి పంపించాడు. అర గంట తర్వాత నవీన్‌ రూమ్‌ గదికి వెళ్లి చూడగా సాయి కార్తీక్‌ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. పక్కనే కూర్చుని ఉన్న సిద్ధార్థ్‌ రెడ్డిని ఏం జరిగిందని ప్రశ్నించగా మినీ సిలిండర్‌తో కొట్టి చంపేశానని... నిన్ను కూడా చంపుతానని దాడి చేసేందుకు ప్రయతి్నంచగా నవీన్‌ బయటికి పరుగులు తీశాడు. 

బుద్వేల్‌ ప్రధాన రహదారిపైకి వచ్చి స్థానికులకు ఈ విషయం చెప్పాడు. దీంతో వారు అక్కడికి వెళ్లి సిద్దార్థ్‌ రెడ్డిని పట్టుకుని రాజేంద్రనగర్‌ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహన్ని మార్చురీకి తరలించారు. సిద్ధార్థ్‌ రెడ్డిని అరెస్ట్‌ చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Videos

హైవేపై ఆయిల్ కాలువలు.. బిందెలతో ఎగబడ్డ జనం

ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్..?

టీచర్ జాబ్స్ లో ట్విస్ట్.. లోకేష్ కు బిగ్ షాక్..!

ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్...

కడప జిల్లాలో పదో తరగతి అర్హతతో ఒక యువతికి టీచర్ పోస్టు..!

దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

ఫ్లెక్సీని చూసి తన తల్లి అనుకొని.. పాల కోసం ఆకలితో లేగదూడ తంటాలు

నువ్వు జోక్యం చేసుకుంటే.. నీ హోంమినిస్టర్ పోస్ట్ ఊడిపోతుంది..!

Photos

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు