Breaking News

తల్లి వైద్యానికి వెళ్లి.. కొడుకు మృతి!

Published on Tue, 06/10/2025 - 11:59

కాళేశ్వరం(మహబూబాబాద్): తల్లికి ఆరోగ్యం బాగాలేదని కొడుకు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చాడు. ఆస్పత్రిలో పరీక్షలు చేసుకున్న తల్లి తన కొడుకు అన్నం సరిగ్గా తింటలేడు, కడుపు నొప్పి అంటున్నాడని వైద్యులకు చూపించింది. పరీక్షలు చేసిన వైద్యులు (సెలెన్‌) గ్లూకోజ్‌ పెట్టి ఇంజక్షన్‌ ఇవ్వడంతో అస్వస్థతకు గురై యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మహదేవపూర్‌ ప్రభుత్వ సామాజిక వైద్యశాలలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. మహదేవపూర్‌ మండలం ఎలికేశ్వరం గ్రామానికి చెందిన రాళ్లబండి సరోజన తనకు ఆరోగ్యం బాగాలేదని చెప్పడంతో కుమారుడు నాగరాజు(23) బైక్‌పై మహదేవపూర్‌ మండల కేంద్రంలోని సామాజిక ఆస్పత్రికి తీసుకొచ్చాడు. 

వైద్యులు పరీక్షలు చేసి మందులు రాసిచ్చారు. కాగా, తల్లి తన కొడుకు కూడా ఆరోగ్యం బాగుండడం లేదని వైద్యులకు తెలిపింది. వైద్యులు నాగరాజుకు పరీక్షలు చేసి (సెలెన్‌) గ్లూకోజ్‌ ఎక్కించి, అందులో ఇంజక్షన్‌ వేశారు. ఈ క్రమంలో ఫిట్స్‌ వచ్చి అస్వస్థతకు గురయ్యాడని, వెంటనే భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని తల్లికి సూచించి వెంటనే పంపారు. భూపాలపల్లి వంద పడకల ఆస్పత్రిలో వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందాడని తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో కొడుకు మరణవార్తతో కోపోద్రేకులైన తల్లిదండ్రులు మృతదేహంతో కలెక్టరేట్‌ గేట్‌ వద్ద వైద్యం వికటించి మృతి చెందాడని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. 

విషయం తెలుసుకున్న మహదేవపూర్‌ ఎస్సై వారికి నచ్చచెప్పి ధర్నా విరమింపజేశారు. ఈ ఘటనపై తల్లి సరోజన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వపన్‌కుమార్‌ తెలిపారు. సరోజన సత్తయ్య దంపతులకు ఇద్దరు కుమారులు కాగా, పెద్ద కుమారుడు మృతితో శోకసంద్రంలో మునిగారు. కాగా,  వైద్యుల తప్పిదంతోనే నాగరాజు చనిపోయాడని, వెంటనే ఉన్నతాధికారులు విచారణ జరిపి సంబంధిత వైద్యులను సస్పెండ్‌ చేసి, బాధితులకు న్యాయం చేయాలని డీవైఎఫ్‌ఐ కార్యదర్శి శ్రీకాంత్‌ డిమాండ్‌ చేశారు.

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)