Breaking News

దొరికిన ఉద్యోగం చేసుకోవడమే!

Published on Fri, 06/06/2025 - 05:14

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ యువతలో విద్యపట్ల ఆసక్తి పెరుగుతున్నప్పటికీ నాణ్యమైన ఉద్యోగాలు సమస్యగా మారాయి. హైదరాబాద్‌ వంటి నగరాల్లోని పేరొందిన కళాశాలల్లో చదివినప్పటికీ కొందరికే నాణ్యమైన, పైస్థాయి ఉద్యోగాలు లభిస్తున్నాయి. క్యాంపస్‌ కొలువుల పేరుతో చిన్న, పెద్ద కంపెనీలు ఇచ్చే అరకొర వేతనాలకే రాష్ట్రంలో యువతరం ఉద్యోగాలు చేస్తున్నట్లు తాజా సర్వేలో తేలింది. యువత జీవితాలు, ఉపాధి, కుటుంబ జీవనంపై యంగ్‌ లైవ్స్‌ సర్వే రౌండ్‌–7 (2023–24) నివేదిక ముఖ్యమైన అంశాలను వెలుగులోకి తెచ్చింది.

తెలంగాణలో 2023 ఆగస్టు నుంచి 2024 జనవరి మధ్య 22 ఏళ్ల వయసు్కలు, 29 ఏళ్ల వయస్కుల విద్య, ఉపాధి, కుటుంబ జీవనంలోని మార్పులను నివేదిక విశ్లేషించింది. ఈ నివేదిక ప్రకారం తెలంగాణలో బాల్య వివాహాల్లో తగ్గుదల కనిపించినప్పటికీ ఉపాధి నాణ్యత, లింగ అసమానతలు, చెల్లింపుల్లేని గృహపనుల భారం మహిళలను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ సవాళ్లను అధిగమించి సమాన ఉపాధి అవకాశాలు, మెరుగైన విద్య, సామాజిక భద్రత కల్పన ద్వారా లింగ సమానత్వం, మంచి ఉద్యోగాల లక్ష్యాలను సాధించడంపై యువత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నివేదిక సూచిస్తోంది. 

విద్య నుంచి ఉపాధి వైపు.. 
ఈ సర్వే ప్రకారం 22 ఏళ్ల వయసు్కల్లో విద్య నుంచి ఉపాధి వైపు పరివర్తన ఆలస్యంగా జరుగుతున్నట్లు తేలింది. 2023లో 53% మంది 22 ఏళ్ల వారు పూర్తి సమయం పనిచేస్తుండగా 2016లో అదే వయసు వారు 62% మంది పనిచేశారు. అదేవిధంగా 20% మంది 22 ఏళ్ల వారు విద్య, ఉపాధి కలిపి చేస్తుండగా 29 ఏళ్ల వారిలో ఇది 12% మాత్రమే. ఈ ఆలస్యం విద్యపై పెరిగిన శ్రద్ధను సూచిస్తోంది. అయితే ఉపాధి అవకాశాల్లో సవాళ్లు పెరిగినట్లు సర్వేలో తేలింది. 

నాణ్యత లేని ఉద్యోగాలు, లింగ వివక్ష 
29 ఏళ్ల వయసు వారిలో 78% మంది నాణ్యతలేని ఉద్యోగాల్లో పనిచేస్తున్నారు. అంటే రాతపూర్వక ఒప్పందం లేని, ఎక్కువ గంటలు పని చేయాల్సిన ఉద్యోగాలు అన్నమాట. అలాగే ఉద్యోగాల్లో పురుషులు (96%) మహిళలు (60%) మధ్య లింగ వ్యత్యాసం స్పష్టంగా కనిపించింది. 22 ఏళ్ల వయసు వారిలో 10% మంది మాత్రమే రాతపూర్వక ఒప్పందాలు ఉన్న ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ 40% మంది 48 గంటల కంటే ఎక్కువ పనిచేస్తున్నట్లు తేలింది. 22 ఏళ్ల పురుషులు సగటున 2.7 గంటలు ఎక్కువ పనిచేస్తుండగా మహిళలు 4.3 గంటలు ఎక్కువగా చెల్లింపులేని గృహ పనులకు సమయం కేటాయిస్తున్నారు.

అలాగే 22 ఏళ్ల వయసు్కలకు వ్యవసాయేతర రంగాల్లో ఉపాధి ఎక్కువగా లభిస్తున్నట్లు తేలింది. 2016 నాటికి 22 ఏళ్ల వయసులో ఉన్న వారు గ్రామీణ ప్రాంతాల్లోని 98 శాతం వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ ఉపాధి రంగాలవైపే దృష్టిసారించినట్లు సర్వే పేర్కొంది. అదే 2023లో 22 ఏళ్ల వయసువారు వ్యవసాయం, అనుబంధ రంగాలలో 64 శాతం మందే ఉన్నట్లు తేలింది. 

బాల్య వివాహాలు తగ్గుదల: 2023లో 22 ఏళ్ల మహిళల్లో 16% మంది 18 ఏళ్ల లోపు వివాహం చేసుకోగా 2016లో ఇది 32 శాతంగా ఉండేది. 19 ఏళ్లలోపు తల్లులైన వారు 2023లో 22 ఉండగా 2016లో అది 29 శాతంఉంది. అయితే తల్లి విద్యాస్థాయి తక్కువగా ఉన్నవారు, ఆర్థికంగా వెనుకబడిన వారిలో బాల్య వివాహాలు, మాతృత్వం ఎక్కువగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది.

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)