Breaking News

ప్రియురాలితో గొడవపడి న్యాయవాది ఆత్మహత్య

Published on Thu, 07/03/2025 - 08:17

ఉప్పల్‌(హైదరాబాద్): ప్రేమించిన యువతితో గొడవ జరగడంతో మనస్తాపానికి లోనైన ఓ యువ లాయర్‌ ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబాబాద్‌ జిల్లా, తొర్రూర్‌ టీచర్స్‌ కాలనీకి  చెందిన కల్లూరి సాయినాథ్‌ (30) ఉప్పల్‌ సూర్యానగర్‌ కాలనీలో ఉంటూ రంగారెడ్డి జిల్లా కోర్టులో న్యాయవాదిగా పని చేస్తున్నాడు. అతను ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే సదరు యువతిని కాదని మరొకరికి పెళ్లి చేసుకునేందుకు అంగీకరించడంతో అతడి ప్రియురాలు సాయినాథ్‌ ఇంటికి వచ్చి గొడవ పడింది.

 దీంతో మనస్తాపానికి లోనైన సాయినాథ్‌ సూర్యానగర్‌లోని స్నేహితుల ఇంటికి వెళ్లాడు. స్నేహితులు డ్యూటీకి వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న సాయినా«థ్‌  గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాయంత్రం ఇంటకి వచ్చిన అతడి స్నేహితులు తలుపులు తెరిచి చూడగా సాయినాథ్‌ అప్పటికే మృతి చెందాడు. వారి సమాచారంతో  సంఘటనా స్థలానికి చేరుకున్న ఉప్పల్‌ పోలీసులు మృత దేహాన్ని స్వా«దీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ అసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

గడ్డి మందు తాగి మరో యువకుడు.. 
గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడు  చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది.  వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాచలం, రామావరం ప్రాంతానికి చెందిన ప్రేమ్‌ కుమార్‌(25) డ్రైవర్‌గా పని చేసేవాడు. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులతో నేపథ్యంలో మంగళవారం సాయంత్రం గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స  పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.   
భారీగా హెరాయిన్‌ పట్టివేత 

మణికొండ: రాజస్థాన్‌ నుంచి హెరాయిన్‌ అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని అరెస్ట్‌ చేసిన పోలీసులు అతడి నుంచి భారీగా హెరాయిన్‌ స్వా«దీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మణికొండ మున్సిపాలిటీ, వైఎస్సార్‌ కాలనీలో ఉంటున్న రాజస్థాన్‌కు చెందిన  వైష్ణోయ్‌ చోగారాం  బుధవారం నార్సింగిలో తమ రాష్ట్రానికి చెందిన వ్యక్తి నుంచి 650 గ్రాముల హెరాయిన్‌ కొనుగోలు చేశాడు. దానిని ఇంటికి తీసుకెళుతుండగా సమాచారం అందడంతో దాడి చేసిన ఎస్‌ఓటీ పోలీసులు సరుకు స్వా«దీనం చేసుకున్నారు. నిందితుడిని నార్సింగి పోలీసులకు అప్పగించారు. పట్టుబడిన హెరాయిన్‌ విలువ రూ.1.5 కోట్లు ఉంటుందనిపోలీసులు తెలిపారు.     

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)