Breaking News

వాగులో కారు బోల్తా: యువకుడి మృతి

Published on Tue, 11/18/2025 - 11:14

డిచ్‌పల్లి: నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలం కొరట్‌పల్లి– మైలారం వాగులో ప్రమాదవశాత్తు కారు బోల్తా పడటంతో.. అందులోని యువకుడు గుండ బాలచందర్‌ (23) మృతి చెందాడు. ఎస్‌ఐ మహ్మద్‌ షరీఫ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. దర్పల్లి మండలం మైలారం గ్రామానికి చెందిన బాలచందర్‌ డీజే నిర్వహించేవాడు. ఆదివారం మధ్యాహ్నం స్నేహితుడి కారు తీసుకుని బయటకు వెళ్లాడు. కొరట్‌పల్లి గ్రామం నుంచి రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో కారులో మైలారం గ్రామానికి బయల్దేరాడు. రెండు గ్రామాల మధ్య వాగు వంతెన పైనుంచి వెళ్తుండగా.. అదుపు తప్పిన కారు వాగు నీటిలో బోల్తా పడింది. 

రాత్రి సమయం కావడం, ఎవరూ చూడకపోవడంతో కారులోని బాలచందర్‌ అందులోనుంచి బయటపడలేక మృతి చెందాడు. వంతెనకు పైన చెక్‌ డ్యాం ఉండటంతో నీళ్లు ఎక్కువగా ఉన్నా యి. సోమవారం ఉదయం కొరట్‌పల్లి గ్రామస్తులు కొందరు వాగు వంతెన పై నుంచి వెళ్తుండగా.. నీటిలో కారును చూసి పోలీసులకు సమాచారం అందించారు. అదే సమయంలో మైలారం గ్రామస్తులు కూడా వాగు వద్దకు చేరుకున్నారు. పోలీసులు జేసీబీతో నీటిలో నుంచి కారును బయటకు తీయగా.. అందులో నుంచి బాలచందర్‌ మృతదేహం బయటపడింది. మృతుని తండ్రి కిషన్‌ గతంలోనే చనిపోయాడు.  

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)