Breaking News

చదువుకోవాలని ఉంది.. కానీ పేదరికం అడ్డొచ్చింది!

Published on Tue, 06/24/2025 - 12:15

యాదగిరిగుట్ట: ఆ బాలికకు చదువుకోవాలని ఉంది.. కానీ పేదరికం అడ్డొచ్చింది. కుటుంబ పరిస్థితులు సరిగ్గా లేకపోవడంతో అమ్మమ్మతో కలసి భిక్షాటన చేస్తోంది. తల్లిదండ్రులు లేకపోవడంతో భిక్షాటన చేస్తున్న ఆ బాలికను యాదగిరిగుట్ట ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ పలకరించి, చదివించేందుకు ప్రయత్నం చేశారు. మెదక్‌ జిల్లా అమీన్‌పూర్‌లోని టైలర్‌ కాలనీకి చెందిన పార్వతమ్మ, ఆమె 12 సంవత్సరాల మనుమరాలు శిరీషలు పేదరికంతో ఇబ్బంది పడుతున్నారు.

 శిరీషకు చదువుకోవాలని ఉన్నా పేదరికంతో చదువుకు దూరమైంది. పొట్టకూటికోసం కొంత కాలంగా తన అమ్మమ్మ పార్వతమ్మతో కలసి యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ వైకుంఠద్వారం వద్ద భిక్షాటన చేస్తోంది. ఈ క్రమంలో యాదగిరిగుట్ట ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ కోటి సోమవారం అటుగా వెళ్తూ బాలికను గమనించి ఆమె వద్దకు వెళ్లారు. 

చదువుకోకుండా భిక్షాటన ఎందుకు చేస్తున్నావని శిరీషను అడిగారు. దీంతో శిరీష ఏడుస్తూ.. తనకు చదువుకోవాలని ఉన్నా డబ్బులు లేవని, పూటగడవడం కోసం అమ్మమ్మతో కలసి భిక్షాటన చేసేందుకు వచ్చానని చెప్పింది. దీంతో చలించిపోయిన ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ కోటి.. భువనగిరి జిల్లా చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి వచ్చిన అధికారులు.. శిరీషకు, ఆమె అమ్మమ్మకు కౌన్సెలింగ్‌ చేసి భువనగిరి జిల్లా కేంద్రానికి తీసుకెళ్లారు. బాలికకు సాయం చేసిన కానిస్టేబుల్‌ కోటిని ట్రాఫిక్‌ సీఐ కృష్ణ అభినందించారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)