Breaking News

రేపటి నుంచి యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు

Published on Fri, 02/28/2025 - 06:02

యాదగిరిగుట్ట: మార్చి 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరిగే యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు రావాలని రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మకు ఆలయ ఈవో భాస్కర్‌రావు ఆహ్వానపత్రిక అందజేశారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలసి ప్రత్యేక ఆహ్వాన పత్రికతో పాటు శ్రీస్వామివారి లడ్డూ ప్రసాదం అందజేశారు. కాగా, బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో భాస్కర్‌రావు తెలిపారు. కొండపైన గల తన కార్యాలయంలో ఆయన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై విలేకరుల సమావేశం నిర్వ­హించారు.

మార్చి 1న విష్వక్సేన ఆరాధన, స్వస్తివాచ­నంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని చెప్పారు. 7వ తేదీన ఎదుర్కోలు మహోత్సవం, 8న శ్రీస్వామి వారి తిరు కల్యాణ మహోత్సవం, 9న రథో­త్సవం, 10న చక్రతీర్థ స్నాన వేడుకలు ఉంటాయ­న్నారు. 11వ తేదీన రాత్రి డోలోత్సవంతో వేడుకలు ముగుస్తాయని వివరించారు. 3వ తేదీ నుంచి శ్రీస్వామి వారి అలంకార, వాహన సేవలు ప్రారంభం అవుతా­యని తెలిపారు. కాగా, బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వర­కు భక్తుల వాహనాలను కొండపైకి టోల్‌చార్జీ వసూలు చేయకుండా ఉచితంగా పంపించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఆయన చెప్పారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)