Breaking News

యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డి రాజీనామా 

Published on Fri, 12/22/2023 - 04:30

యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఈవో గీతారెడ్డి గురువారం రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను వెంటనే ఆమోదించిన అధికారులు, ఆలయ నూతన ఈవోగా దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌ రామకృష్ణారావును నియమించారు. 2014 డిసెంబర్‌ 2న గీతారెడ్డి యాదాద్రి ఆలయ ఈవోగా బాధ్యతలు తీసుకున్నారు. తొమ్మిదేళ్ల పాటు ఆమె ఈవోగా బాధ్యతల్లో ఉన్నారు.

గీతారెడ్డి 2020 ఫిబ్రవరి 28న పదవీ విరమణ చేయాల్సి ఉండగా.. యాదాద్రి ఆలయ అభివృద్ధి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని నాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒక సంవత్సరం పాటు అంటే 2021 ఫిబ్రవరి 28వ తేదీ వరకు గీతారెడ్డి సర్వీసును పొడిగించింది. అనంతరం ప్రధాన ఆలయ ఉద్ఘాటన నేపథ్యంలో ఆమె పదవీ కాలాన్ని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మళ్లీ పొడిగించింది.

మరో అధికారిని ఈవోగా నియమించే వరకు గీతారెడ్డినే ఆలయ ఈవోగా కొనసాగుతారని జీవో ఇచి్చంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో పదవీ విరమణ పొందిన ప్రభుత్వ అధికారులంతా తమ రాజీనామాలు సమరి్పస్తుండటంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో గీతారెడ్డి రాజీనామా చేశారు.  

రామకృష్ణారావు బాధ్యతల స్వీకరణ.. 
యాదాద్రి ఆలయ నూతన ఈవోగా దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌ రామకృష్ణారావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ఆయన గర్భాలయంలో స్వయంభూ, ప్రతిష్టా అలంకార మూర్తులను దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రామకృష్ణారావుకు ప్రధాన కార్యాలయంలో గీతారెడ్డి బాధ్యతలను అప్పగించారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)