Breaking News

తప్పు ఒకరిది.. జరిమానా మరొకరికి..

Published on Sat, 03/07/2026 - 12:19

మంచిర్యాల జిల్లా: ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులను కట్టడి చేసేందుకు పోలీసులు ఉపయోగిస్తున్న ఈ–చలాన్ల విధానంలో అప్పుడప్పుడు దొర్లుతున్న పొరపాట్ల కారణంగా తప్పు చేయని వారికి శిక్షలు పడుతున్నాయి. ఫొటోలు తీసి జరిమానా విధించే క్రమంలో నంబర్లు సరిగా గుర్తించకపోవడంతో ఒకరు చేసిన తప్పునకు మరొకరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. 

రెండ్రోజుల క్రితం ఏం జరిగిందంటే..
మంచిర్యాల జిల్లాలో రెండు రోజుల క్రితం మందమర్రి సమీపంలో ఒక వాహనదారుడు హెల్మెట్‌ ధరించలేదని పోలీసులు ఫొటో తీశారు. అయితే, ఆ ఫొటో ఆధారంగా చలాన్‌ జనరేట్‌ చేసే సమయంలో సిబ్బంది నిర్లక్ష్యమో లేదా సాంకేతిక లోపంతో నో వాహనం నంబర్‌ తప్పుగా నమోదైంది. దీంతో నిబంధనలు ఉల్లంఘించిన వాహన దారుడికి కా కుండా 65 కిలోమీటర్లు దూరంలోని దండేపల్లి మండలం తాళ్లపేట బస్టాండ్‌ సమీపంలో నిలిపి ఉంచిన ఏ తప్పు చేయని వాహనదారుడికి జరిమానా విధించినట్లు మెసేజ్‌ వెళ్లింది.

 దీంతో అతను వెంటనే ఈ–చలాన్‌ ఓపెన్‌ చేసి చూడగా, మందమర్రిలో ఉన్న వాహనాన్ని ఫొటో తీస్తే నాకు జరిమానా రావడం ఏమిటని ఆశ్చర్య పోవడమే కాకుండా ఇదేమిటని తలపట్టుకున్నాడు. దీనికి ఎవరు బాధ్యులు, నేను చేయని తప్పునకు జరిమానా ఎందుకు చెల్లించాలని ప్రశ్నిస్తున్నాడు. పోలీస్‌ ఉన్నతాధికారులు స్పందించి ఇలాంటి సాంకేతిక లోపాలను సరిదిద్ది, చలాన్‌లు విధించే ముందు నంబర్‌ ప్లేట్లను క్షుణ్ణంగా పరిశీలించాలని బాధితులు కోరుతున్నారు.

 

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు