Breaking News

ఎండకు ‘కంది’పోదు!

Published on Tue, 06/10/2025 - 05:01

సాక్షి, హైదరాబాద్‌: గరిష్ట ఉష్ణోగ్రతలను తట్టుకొని.. హెక్టార్‌కు 2 టన్నుల దిగుబడిని ఇచ్చే కంది వంగడాన్ని ఐసీపీవీ 25444 పేరుతో ఇక్రిశాట్‌ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది 45 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలను కూడా తట్టుకుంటుంది. కేవలం 125 రోజుల్లో పంట చేతికి వచ్చే ఈ వంగడాన్ని ఖరీఫ్, రబీలో ఎప్పుడైనా సాగు చేయొచ్చు. కేవలం రెండున్నర అడుగులు మాత్రమే పెరిగే ఈ కందిని మిషన్‌ ద్వారా కోయొచ్చు. 

కూలీల సమస్య, ఎరువుల అవసరం తగ్గుతుంది. ఈ మేరకు ఇక్రిశాట్‌ అధికారులు సోమవారం హైదరాబాద్‌ నుంచి మీడియాను పటాన్‌చెరులో సంస్థ అభివృద్ధి చేసిన ఐసీపీవీ 25444 రకం కంది చేల దగ్గరకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఇక్రిశాట్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ హిమాన్షు పాఠక్, డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ స్టాన్‌ఫోర్డ్‌ బ్లేడ్, ప్రోగ్రాం డైరెక్టర్‌ షాన్‌ మైట్స్, లీడ్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ ప్రకాష్‌ గంగశెట్టి, అసోసియేట్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ శ్రుతి బెలియప్ప తదితరులు ఐసీపీవీ 25444 కంది వంగడం గురించి వివరించారు. 

అత్యధిక వేడిని తట్టుకునే పంట 
కర్ణాటక, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో ఐసీపీవీ 25444 వంగడాన్ని విజయవంతంగా పరీక్షించామన్నారు. 2021లో దీనికోసం ప్రయత్నాలు ప్రారంభించి, 2024 నాటికి స్పీడ్‌ బ్రీడింగ్‌ పద్ధతిలో పూర్తి చేశామని తెలిపారు. కొత్త రకాన్ని అభివృద్ధి చేయడానికి అయ్యే 15 సంవత్సరాల పనిని కేవలం ఐదేళ్లలో పూర్తి చేసినట్టు వివరించారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో కందిపప్పుకు ఒక కొత్త దశను తీసుకొచ్చే అద్భుత ఆవిష్కరణగా వారు పేర్కొన్నారు. 

దేశీయ పప్పుదినుసుల లోటును తీర్చే శుభవార్త
భారత్‌లో కందిపప్పు వినియోగం 5 మిలియన్‌ టన్నులుగా ఉండగా, దేశీయంగా 3.5 మిలియన్‌ టన్నుల కందిపప్పు మాత్రమే ఉత్పత్తి జరుగుతుందని లీడ్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ ప్రకాశ్‌ గంగశెట్టి తెలిపారు, దేశ అవసరాలకు మరో 1.5 మిలియన్‌ టన్నులు అవసరం కాగా, ఇందుకోసం సంవత్సరానికి రూ. 6,700 కోట్ల దిగుమతుల భారం పడుతోందని తెలిపారు. ఇక్రిశాట్‌ ద్వారా అభివృద్ధి చేసిన ఐసీపీవీ 25444 వంగడంతో ఈ లోటు తీరే అవకాశముందన్నారు. తాండూరు, వికారాబాద్, వరంగల్, నల్లగొండ, మెదక్, సంగారెడ్డి ప్రాంతాలు ఈ పంటకు అనుకూలమని చెప్పారు.

భారత్‌తో పాటు ఇతర దేశాల్లో కూడా...
భారత్‌తోపాటు ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, ఈక్వడార్‌ దేశాల్లోనూ ఈ కందిని ఉత్పత్తికి వినియోగించేందుకు అవకాశముందని ఇక్రిశాట్‌ శాస్త్రవేత్తలు తెలిపారు. వాతావరణ స్థిరత్వ పంటగా ఐసీపీవి 25444కి మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో రైతుల ఆదాయాన్ని మెరుగుపరిచే శక్తి ఉందన్నారు. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)