దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి

Published on Wed, 12/04/2024 - 04:22

గన్‌ఫౌండ్రి  (హైదరాబాద్‌): చిన్న లోపాన్ని చూసుకొని మానసికంగా కుంగిపోవద్దని ఆత్మవిశ్వాసంతో అడుగులు వేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మంగళవారం రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. త్వరలోనే దివ్యాంగులకు పెన్షన్‌ పెంచడంతో పాటు వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. 

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దివ్యాంగులకు రూ.300 పెన్షన్‌ ఇస్తోందని అది రూ.3 వేలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. గత 11 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్‌ను ఒక్క రూపాయి కూడా పెంచకపోవడం దారుణమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వికలాంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ బుచి్చనేని వీరయ్య మాట్లాడుతూ, రాబోయే రెండు నెలల్లో 40 శాతం వైకల్యానికి ఉచితంగా సహాయ ఉపకరణాలు పంచుతున్నట్లు ప్రకటించారు. 

అనంతరం వివిధ రంగాలలో అద్భుత విజయాలు సాధించిన దివ్యాంగులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పలువురు దివ్యాంగులు చేసిన నృత్య ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. కాళ్లులేని దివ్యాంగులకు మంత్రి సీతక్క స్వయంగా కృత్రిమ కాళ్లను తొడిగారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రాంచంద్రన్, డైరెక్టర్‌ శైలజ, జీఎం.ప్రభంజన్‌రావులతో పాటు వివిధ వికలాంగుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.   

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)