Breaking News

రోగ నిర్ధారణతో బ్రెయిన్ ట్యూమర్ ఆటకట్టు

Published on Tue, 06/10/2025 - 12:13

హైదరాబాద్: ప్రాణాంతకమైన బ్రెయిన్ ట్యూమర్ (మెదడులో కణతులు) వ్యాధి ఆట కట్టించాలంటే సరైన నిర్ధారణ, చికిత్సలే కీలకమని హైదరాబాదులోని ప్రముఖ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ ఆలీవ్ హాస్పిటల్ న్యూరాలజీ నిపుణులు పేర్కొన్నారు. ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవం సందర్భంగా ఈ వ్యాధిపై పౌరులకు అవగాహన కల్పించేలా కార్యక్రమాన్నినిర్వహించారు. 

ఆరోగ్య సంరక్షణలో విశ్వసనీయత, మెరుగైన ఆరోగ్య ఫలితాలను సాధిస్తూ, రోగుల ప్రాణాలను కాపాడటానికి అంకితభావంతో వైద్య సేవలు అందించేందుకు ఆలివ్ హాస్పిటల్ కృషి చేస్తొంది. జీవితాన్నితల కిందులు చేసే బ్రెయిన్ ట్యూమర్ల వ్యాధిపైప్రజలలో అవగాహన పెంచడం, ముందస్తుజాగ్రత్తలతో పలు సూచనలు చేస్తున్నారు. క్యాన్సర్, క్యాన్సర్ కాని మెదడు కణితులు ఏటా వేలాది మంది భారతీయులను ప్రభావితం చేస్తున్నాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) డేటా ప్రకారం, దేశంలో ప్రతి ఏడాది 40,000 కంటే ఎక్కువ మందిలో కొత్తగా మెదడు కణితులు గుర్తించబడుతున్నాయి.

 తరచూ తలనొప్పి, దృష్టిలోపాలు, జ్ఞాపకశక్తికోల్పోవడం వంటి నిర్దిష్ట లక్షణాల ఫలితంగా అనేక ఇతర కణితులు గుర్తించబడకుండా పోతున్నాయని నిపుణులు వివరించారు. ఈ సందర్భంగా “ఆలివ్ హాస్పిటల్ గత ఏడాదిలోనే బ్రెయిన్ ట్యూమర్ కన్సల్టేషన్లలో 20% పెరుగుదలను నమోదు చేసిందనీ గుర్తుచేశారు. ఆసుపత్రిలోని న్యూరాలజీ, న్యూరోసర్జరీ యూనిట్లు అధునాతన MRI డయాగ్నస్టిక్స్, స్టీరియోటాక్టిక్ సర్జికల్ పరికరాలు, న్యూరాలజీ , పాలియేటివ్ కేర్, పునరావాస మద్దతుతో కూడిన మల్టీడిసిప్లినరీ కేర్ మోడల్ తో పూర్తిగా అధునాతన పరిజ్ఞానంతో వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉంది.

‘మెదడు కణితులు మోసపూరితమైనవి; లక్షణాలు ఎప్పుడూ బయటపడవు. అప్పుడప్పుడు ఇది నిరంతర తలనొప్పిలేదా ప్రవర్తనలో వివరించలేని మార్పువంటి సాధారణమైన దానితో ప్రారంభమవుతుంది. తమ శరీరాలపైశ్రద్ధ వహించాలని, ముందుగానే తమను తాము తనిఖీ చేసుకునేలా ఆలీవ్ హాస్పిటల్ ప్రోత్సహిస్తోంది. రోగాన్నిగుర్తించడం వల్ల సంరక్షణ నాణ్యత పెరుగుతుందనీ, రోగి యొక్క జీవన నాణ్యత పెరుగుతోంది. వ్యాధిని నయం చేయడంతో పాటుగా, రోగులు, వారి కుటుంబాలకు చికిత్స, ఆరోగ్య సంరక్షణ ప్రయాణంలో ప్రతి అడుగులో తోడుగా ఉంటుంది అని ఆలివ్ హాస్పిటల్ లోని సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ మొహమ్మద్ మహమూద్ అలీ అన్నారు.

 క్లినికల్ సూక్ష్మ నైపుణ్యాలతోపాటుగా, రోగి, వారి కుటుంబాలకు భావోద్వేగ, మానసిక భారాన్నికూడా పెంచుతుందని అర్థం చేసుకోవాలి. ఆలివ్ హాస్పిటల్ సకాలంలో నాడీ మూల్యాంకన చేసి వ్యాధిని కచ్చితత్వంతో గుర్తిస్తుంది. మెదడు కణితుల ప్రారంభ దశను కొన్నిసూచనల ద్వారా గుర్తించే వీలు ఉందని, దీంతో అధిక ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి బయటపడే వీలుంటుందని వైద్యులు పేర్కొన్నారు. జూన్ 8న నిర్వహించే ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ డే సంద్భరంగా వ్యాధిపైఉన్న అపోహలను తొలగించడానికి, న్యూరో హెల్త్ పై అవగాహన కల్పించడానికి కృషి చేస్తున్నట్లుగా అలీ హాస్పిటల్ న్యూరో విభాగం వైద్యులు వివరించారు.

ఆలివ్ హాస్పిటల్ గురించి: 
ఆరోగ్య సంరక్షణకు భరోసానిస్తూతెలంగాణ రాష్ట్ర స్థాయిలో ఆలివ్ హాస్పిటల్స్కృషి చేస్తుంది. ఆధునాతన వైద్య సదుపాయాలు, నాణ్యత, నిబద్ధతతో కూడిన సమగ్ర ఆరోగ్య సంరక్షణయే లక్ష్యంగా 2010 నుంచి వైద్య సేవలు అందిస్తోంది. మానవాళికి ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణను అందుబాటులోకి తీసుకురావడం కోసం సాధారణ వైద్య సంస్థగా మొదలుపెట్టి.. ఆనాటి కాలంలోనే రోగి సంరక్షణలో అత్యుత్తమ ప్రతిభతో ఆలివ్ హాస్పిటల్ తెలంగాణలోని ప్రముఖ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులలో ఒకటిగా నిలిచింది. 210 పడకలతో, అత్యాధునిక మల్టీస్పెషాలిటీ హెల్త్కేర్ సౌకర్యం వివిధ స్పెషాలిటీలలో విస్తృత శ్రేణి వైద్య సేవలను అందిస్తుంది. 

కార్డియాక్ కేర్, ఎమర్జెన్సీసర్వీసెస్, న్యూరో కేర్, కిడ్నీకేర్, యూరాలజీ, ఆర్థోపెడిక్స్, జాయింట్ రీప్లేస్ మెంట్స్, గైనకాలజికల్ సర్వీసెస్, అడ్వాన్స్డ్ డయాగ్నస్టిక్స్, ఇంటర్వెన్షనల్ సర్వీసెస్ వంటి రంగాలలో అనేక అధునాతన విధానాలలో మార్గదర్శకత్వం వహించింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్నిఉపయోగించి, సమర్థులైన వైద్యులతో వైద్యం అందించడానికి కట్టుబడి ఉంది. దేశంలో ఆరోగ్య సంరక్షణ నాణ్యత ప్రమాణాలను కలిగి నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ఫర్ హాస్పిటల్స్– హెల్త్కేర్ నుండి జాతీయ స్థాయిలో గుర్తింపును కలిగి ఉంది.  

Videos

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)