Breaking News

ప్రయాణం ఫ్రీనే.. బస్సే లేదు

Published on Sat, 02/08/2025 - 11:08

సిరిసిల్ల: అది రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల సరిహద్దుల్లోని దట్టమైన అటవీ ప్రాంతం.. గంభీరావుపేట మండలం దమ్మన్నపేట శివారులోని పెద్దమ్మ స్టేజీ.. అక్కడి నుంచి ఎటు చూసినా రెండు కిలోమీటర్ల మేర అడవి తప్ప ఒక్క ఊరు ఉండదు. కనీసం తాగేందుకు మంచినీరు కూడా దొరకదు. అలాంటి ప్రాంతంలో రెండు రోజుల క్రితం పాతిక మంది ప్రయాణికులు... అందులోనూ మహిళలు బస్సు(bus) కోసం గంటలకొద్దీ వేచి ఉన్నారు. వీరంతా దమ్మన్నపేట, నాగంపేట, ముచ్చర్ల, సమీపంలోని గిరిజన తండాలకు చెందిన వారు. 

పెద్దమ్మ స్టేజీ నుంచి కామారెడ్డికి వెళ్లేందుకు మధ్యాహ్నం ఒంటి గంటకు వచ్చారు. మూడున్నర గంటల వరకూ ఒక్క బస్సు కూడా రాకపోవడంతో ఎండలో గొంతులెండి అలమటించారు. ఒక్క బస్సు కూడా రాకపోవటంతో తీవ్ర అసహనానికి గురయ్యారు. కొందరైతే ప్రయాణం మానుకుని వెనుదిరిగారు. ఉచిత ప్రయాణం అనుకుంటే ఉన్న బస్సులు కూడా రావటంలేదని మహిళలు ఆవేదన వ్యక్తంచేశారు. 

ఇది ఆర్డీనరీ బస్సుల బాట: కరీంనగర్‌–కామారెడ్డి ప్రధాన రహదారి నిడివి 98 కిలోమీటర్లు. ఆర్డినరీ బస్సులు తప్ప ఒక్క ఎక్స్‌ప్రెస్‌ కూడా ఈ మార్గంలో లేవు. ఈ మార్గంలో సిరిసిల్ల జిల్లా కేంద్రం, వేములవాడ పుణ్యక్షేత్రంతోపాటు ఎల్లారెడ్డిపేట, మాచారెడ్డి, గంభీరావుపేట మండలాలు, అనేక గ్రామాలున్నాయి. అయినా ఆర్టీసీ అధికారులు అరకొరగా ఆర్డినరీ బస్సులతో నెట్టుకొస్తుండటంపై ప్రయాణికులు మండిపడుతున్నారు.  

ఆ రూట్‌ మా పరిధిలో లేదు
ఆ రూట్‌ మా పరిధిలో లేదు. కామారెడ్డి–కరీంనగర్‌ రూట్‌ను కరీంనగర్‌–1, కామారెడ్డి డిపోలు పర్యవేక్షిస్తాయి. బస్సులు రాకపోవడం, లేకపోవడంపై నాకు సమాచారం లేదు. ఆ రెండు డిపోల అధికారులను సంప్రదిస్తే కారణాలు తెలుస్తాయి. 
– ప్రకాశ్‌రావు, సిరిసిల్ల డిపో మేనేజర్‌. 

Ration Cards: మీసేవ కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)