Breaking News

ఆస్తి ఆడపడుచులకు.. మరి నాకు, ముగ్గురు పిల్లలకు మిగిలేదేంటి?

Published on Wed, 01/03/2024 - 12:36

హైదరాబాద్: మమ్మల్ని అల్లారు ముద్దుగా చూసుకునే భర్త అనారోగ్యంతో చనిపోయాడు... మాకు రావలసిన ఆస్తిని తన పిల్లలకు కాకుండా ఆడపడుచులకు ఇచ్చి అత్త అన్యాయం చేస్తుందని, తనకు, తన పిల్లలకు న్యాయం చేయాలని ఓ మహిళ మౌన దీక్షకు దిగింది. మణికొండ మున్సిపాలిటీ కేంద్రంలోని శివాజీనగర్‌ కాలనీలో ఈ సంఘటన మంగళవారం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెలితే... మణికొండ గ్రామ పంచాయతీకి వార్డు సభ్యునిగా పనిచేసిన ధన్‌రాజ్‌ అనారోగ్యంతో మూడు సంవత్సరాల క్రితం మరణించాడు. 

దాంతో ఇద్దరు కూతుర్లు, ఓ కుమారుని భారం భార్య సుధారాణిపై పడింది. మున్సిపాలిటీ కార్యాలయంలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిగా పనిచేస్తూ వారిని చదివిస్తుంది. తన భర్త సంపాదించిన ఆస్తిని తన పిల్లలకు చెందనివ్వకుండా అత్త యాదమ్మ ఇటీవల ఆడపడుచులు సావిత్రి, రేణుకల పేరుపైకి మార్చింది. అది తెలిసి తనకు న్యాయం చేయాలని కాలనీ, గ్రామ పెద్దలకు మొరపెట్టుకున్నా స్పందన లేకపోయింది.దీంతో పిల్లలతో కలిసి తనకు న్యాయం చేయాలని శివాజీనగర్‌ కమ్యూనిటీ హాల్‌ వద్ద మౌన దీక్షకు దిగింది.  

వారంలో న్యాయం చేస్తాం... 
ఆమె పరిస్థితిని తెలుసుకుని కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రమేష్, వార్డు కౌన్సిలర్‌ యాలాల లావణ్య నరేష్, రాయదుర్గం పోలీసులు స్పందించి వారం రోజుల్లో చర్చించి న్యాయం చేస్తామని హామి ఇచ్చారు. దాంతో ఆమె ఆందోళనను విరమించింది.  

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)