Breaking News

సీట్ల కోసం గొడవ.. దారుణంగా కొట్టుకున్న మహిళలు

Published on Mon, 01/01/2024 - 13:35

సంగారెడ్డి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించగా.. దాదాపు బస్సులన్నీ మహిళలతో కిక్కిరిసిపోతున్నాయి. కూర్చునేందుకు సీట్లు కూడా దొరకని పరిస్థితి నెలకొంటుండటంతో పలుచోట్లా గొడవలు జరుగుతున్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లాలో కూడా ఇదే ఘటన చోటుచేసుకుంది. సీటు కోసం ఇద్దరు మహిళలు తిట్టుకోవడం తో పాటు జుట్టుపట్టుకుని మరీ కొట్టుకున్నారు.

దీంతో బస్సులోని గుర్తు తెలియని వ్యక్తి వీడియో తీయగా.. అది కాస్త సోషల్ మీడియాలోకి ఎక్కి చక్కర్లు కొడుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. సోమవారం ఉదయం జహీరాబాద్ నుంచి సంగారెడ్డి వెళ్లేందుకు పల్లెవెలుగు బస్సు బస్టాండ్కు వచ్చింది. ఇప్పటికే ఎక్కువగా రష్ ఉంటుండటం, సీట్ల కోసం పోటీ ఏర్పడుతుండటంతో ఓ మహిళ బస్సు ఆగగానే కిటికీలో నుంచి కర్చీఫ్ వేసింది. బస్సు ఆగిన అనంతరం పెద్ద సంఖ్యలో మహిళలు బస్సులోకి ఎక్కారు.

బస్సులోనే కొట్లాట
ఇద్దరు తిట్టుకుంటూనే జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. బస్సులో ఉన్న మిగతా మహిళలు, పురుషులు సర్ది చెప్పినా ఫలితం లేకుండా పోయింది. ఇద్దరూ సీటు కోసం కొట్లాడుకుంటుండటంతో బస్సులో ఉన్న మిగతా ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. సర్దిచెప్పినా వినకుండా గొడవ పడుతుండటంతో గందరగోళానికి గురయ్యారు. చివరకు బస్సులో ఉన్న ప్రయాణికులు ఇద్దరి మధ్య కలగజేసుకుని సర్ది చెప్పడంతో గొడవకు ఫుల్ స్టాప్ పడింది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)