Breaking News

భార్యను చంపి, ముక్కలు చేసి.. కుక్కర్‌లో ఉడికించి..

Published on Thu, 01/23/2025 - 01:26

సాక్షి, హైదరాబాద్‌/మీర్‌పేట: ఓ వ్యక్తి అనుమానంతో తన భార్యను పాశవికంగా హత్య చేశాడు. అయినా కసి తీరక ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికాడు. ఓ పెద్ద కుక్కర్‌ తీసుకొచ్చి శరీర భాగాలను ఉడకబెట్టాడు. తర్వాత ఎండబెట్టి, కాల్చాడు. ఇంట్లోనే రెండు, మూడు రోజుల పాటు రోకలి బండతో దంచి పొడిగా చేశాడు. ఆ పొడిని డ్రైనేజీ మ్యాన్‌హోల్‌లో కలిపేశాడు. మిగిలిన ఎముకల ముక్కలను సమీపంలోని జిల్లెలగూడ (చందన) చెరువులో పారేశాడు. రంగారెడ్డి జిల్లా మీర్‌పేట పోలీసు స్టేషన్‌ పరిధిలోని జిల్లెలగూడ న్యూ వేంకటేశ్వర కాలనీలో ఈ దారుణం చోటు చేసుకుంది. 

హత్య చేసి.. ఇంట్లోంచి వెళ్లిపోయిందని... 
స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం..ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన విశ్రాంత ఆర్మీ జవాన్‌ గురుమూర్తి (39), వెంకట మాధవి (35) భార్యాభర్తలు. వారికి 13 ఏళ్ల క్రితం వివాహమైంది. ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఐదేళ్ల క్రితం జిల్లెలగూడ న్యూ వేంకటేశ్వర కాలనీలోకి వచ్చి, అద్దె ఇంట్లో ఉంటున్నారు. గురుమూర్తి కంచన్‌బాగ్‌లోని డీఆర్‌డీఓలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. గురుమూర్తి విపరీత ప్రవర్తన, అనుమానిస్తూ వేధిస్తుండటంతో భార్య మాధవి ఇబ్బందిపడుతూ ఉండేది. ఇరువురి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. 

ఈ నెల 16న గురుమూర్తి, మాధవి మధ్య మరోసారి వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో గురుమూర్తి ఆమెను పాశవికంగా హత్యచేశాడు. కానీ ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయిందని అందరికీ చెప్పాడు. మాధవి తల్లి ఉప్పాల సుబ్బమ్మ తన కూతురు కనిపించకుండా పోయిందని ఈ నెల 18న మీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. 

అదుపులోకి తీసుకుని విచారించడంతో.. 
ఇంట్లో గొడవ జరిగిన సమయంలోనే మాధవిని గురుమూర్తి హత్య చేశాడు. కానీ ఏమీ ఎరగనట్టుగా అత్తమామలతోపాటు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్టు తెలుసుకున్న పోలీసులు గురుమూర్తిపై నిఘా పెట్టారు. అతడి ప్రవర్తన, కదలికలపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకొని విచారించగా.. అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి లోతుగా దర్యాప్తు చేస్తున్నామని మీర్‌పేట్‌ సీఐ నాగరాజు తెలిపారు. 

యూట్యూబ్‌లో చూసి.. ముందుగా కుక్కపై ప్రయోగం చేసి.. 
భార్యను హత్య చేసిన గురుమూర్తి పోలీసులకు ఎలాంటి ఆధారాలు, ఆనవాళ్లు చిక్కకుండా పక్కా ప్లాన్‌ చేశాడు. శరీరంలోని ఎముకలను పొడిగా ఎలా మార్చాలని యూట్యూబ్, ఇతర సామాజిక మాధ్యమాల్లో శోధించాడు. క్రైమ్, హర్రర్‌ సినిమాలు చూశాడు. ముందుగా వీధి కుక్క మీద ప్రయోగం చేశాడు. కుక్కను ఇంట్లోకి తీసుకొచ్చి చంపేశాడు. ముక్కలుగా నరికి, ఎముకలతో సహా కుక్కర్‌లో ఉడకబెట్టాడు. తర్వాత అదే తరహాలో భార్య శరీరాన్ని కూడా ముక్కలు చేసి, ఉడకబెట్టాడు. ఎండబెట్టి, కాల్చి పొడి చేశాడు. 



ఆధారాల కోసం పోలీసుల ప్రయత్నాలు.. 
మాధవి మిస్సింగ్‌ కేసు నేపథ్యంలో.. జిల్లెలగూడ న్యూవేంకటేశ్వర కాలనీలో గురుమూర్తి, మాధవి నివాసమున్న ఇల్లు, పరిసర ప్రాంతాలను పోలీసులు మూడు రోజులుగా క్షుణ్నంగా పరిశీలించినట్టు తెలిసింది. ఆమె హత్యకు గురై ఉంటే ఏమైనా ఆధారాలు లభిస్తాయేమోనని డ్రైనేజీ మ్యాన్‌హోల్స్, నాలాలను కూడా తెరిచి పరిశీలించినట్టు స్థానికులు తెలిపారు. కానీ నిందితుడిని విచారించిన సమయంలో అసలు సంగతి బయటపడింది. దీనితో ఆయా అంశాలను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. నిందితుడు గురుమూర్తి పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. వారి పిల్లలు మేడ్చల్‌లోని అమ్మమ్మ వాళ్ల ఇంట్లో ఉన్నట్టు తెలిసింది. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)