Breaking News

భార్యను వదిలేసి పరారీ..

Published on Wed, 12/25/2024 - 03:53

బాన్సువాడ: అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను రోడ్డు పక్కన వదిలేసి పారిపోయాడొక భర్త. తనకోసం భర్త వస్తాడని ఆ అభాగ్యురాలు ఆరు రోజులుగా నిరీక్షిస్తోంది. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జరిగిన ఈ సంఘటన వివరాలివి. నిజామాబాద్‌ జిల్లా రుద్రూర్‌కు చెందిన లక్ష్మణ్‌ బిచ్కుందలో ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లో కూలీగా పనిచేస్తున్నాడు. 

లక్ష్మణ్‌ భార్య జ్యోతి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో ఈనెల 18న రాత్రి లక్ష్మణ్‌ తన భార్య జ్యోతిని తీసుకుని బాన్సువాడలోని సర­స్వతి మందిరం సమీపానికి వచ్చాడు. అక్కడ ఉన్న ఇసుక డంప్‌పై ఆమెను పడుకోబెట్టి, తెల్లారి వస్తానని చెప్పి, మూడు నెలల బాబును మాత్రం తీసుకుని వెళ్లాడు. తెల్లా­రి వస్తానని చెప్పి వెళ్లినవాడు ఇప్పటికీ రాలేదు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించి నడవలేని స్థితిలో ఉన్న జ్యోతి.. చలిలో ఇసుకపైనే గడుపుతోంది. 

అక్కడ ఉన్న స్థానికులు దీనిని గమనించి రోజూ అన్నం పెడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించేందుకు ప్రయతి్నంచామని, కానీ వైద్యులు చేర్చుకోలేదని తెలిపారు. మంగళవారం కొందరు 108 అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వగా.. వారు వచ్చి జ్యోతిని ఏరియా ఆస్పత్రికి తరలించారు. భర్త వచ్చి తనను తీసుకెళ్తాడని జ్యోతి ఆశతో ఇప్పటికీ ఎదురుచూస్తోంది. 

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు