Breaking News

మహిళా ఐపీఎస్‌ అధికారిణి లక్ష్యంగా అభ్యంతరకర వ్యాఖ్యలు

Published on Tue, 08/04/2026 - 10:57

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ పోలీస్‌ శాఖలో డీజీపీ హోదాలో పనిచేస్తున్న మహిళా ఐపీఎస్‌ అధికారిణి లక్ష్యంగా చేసుకుని సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో అత్యంత అసభ్యకర, మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేసిన ఖాతాపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళా అధికారి పరువుకు భంగం కలిగించేలా, అసభ్య పదజాలంతో పోస్టు చేసినట్లు గుర్తించిన టీజీసీఎస్‌బీ సైబర్‌ ప్యాట్రోలింగ్‌ బృందం స్వయంగా (సుమోటో) ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

 ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. టీజీసీఎస్‌బీ ప్రధాన కార్యాలయంలో సైబర్‌ ప్యాట్రోలింగ్‌ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ ఆగస్టు ఒకటిన సైబర్‌ పర్యవేక్షణలో భాగంగా "IMRANKHAN(@Shailubha 007 పేరుతో ఉన్న ఎక్స్‌ ఖాతాలో సీనియర్‌ మహిళా ఐపీఎస్‌ అధికారిపై అత్యంత అసభ్యకర, అవమానకర వ్యాఖ్యలు చేసిన పోస్టును గుర్తించారు. ఆ పోస్టులోని పదజాలం మహిళా అధికారిని మాత్రమే కాకుండా మహిళా ప్రజాప్రతినిధులు, మహిళా ప్రభుత్వ ఉద్యోగుల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ఈ పోస్టుకు సంబంధించిన స్క్రీన్‌షాట్లు, యూఆర్‌ఎల్‌లు తదితర డిజిటల్‌ ఆధారాలను భద్రపరిచిన అనంతరం టీజీసీఎస్‌బీ సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడి అసలు వివరాలు, సబ్‌స్క్రైబర్‌ సమాచారం, ఇతర ఎలక్ట్రానిక్‌ రికార్డులను సంబంధిత సోషల్‌ మీడియా వేదిక నుంచి సేకరించాలని పోలీసులు నిర్ణయించారు. పోస్టు చేసిన వ్యక్తిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దర్యాప్తు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కేసు దర్యాప్తును ఇన్‌స్పెక్టర్‌ ఎం.రవికుమార్‌కు అప్పగించారు. 

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)