Breaking News

బస్టాండ్‌లో మహిళ ప్రసవం

Published on Mon, 06/17/2024 - 03:28

కరీంనగర్‌ టౌన్‌: భర్తతో కలిసి స్వస్థలానికి వెళ్లేందుకు బస్సు కోసం ఎదురుచూస్తున్న ఓ నిండు గర్భిణి కరీంనగర్‌ బస్టాండులో ఆదివారం సాయంత్రం పండంటి ఆడబిడ్డను ప్రసవించింది. ఆర్టీసీ, 108 సిబ్బంది ఆ మహిళకు పురుడుపోశారు. ఒడిశాకు చెందిన కుమారి– దూల దంపతులు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం కాట్నపల్లిలోని ఇటుక బట్టీలో కొద్దిరోజులుగా కూలీలుగా పనిచేస్తున్నారు.

నిండు గర్భిణి అయిన కుమారిని తీసుకుని ఆమె భర్త దూల ఆదివారం కుంట–భద్రాచలం మీదుగా స్వస్థలానికి వెళ్లేందుకు కరీంనగర్‌ బస్‌స్టేషన్‌ చేరుకున్నారు. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో కుమారికి పురిటినొప్పులు వచ్చాయి. కాసేపటికి ఎక్కువ కావడంతో ఆమె భర్త అక్కడే ఉన్న ఆర్టీసీసిబ్బంది సాయం కోరాడు. వారు వెంటనే 108 సిబ్బందికి ఫోన్‌ చేశారు. ఇంతలో అక్కడే ఉన్న ఆర్టీసీ మహిళా సిబ్బంది పరిస్థితిని గమనించి ప్లాట్‌ఫాం ఎదురుగా ఉన్న చెట్టు కిందకు కుమారిని తీసుకెళ్లారు. 

చుట్టూ చీరలు అడ్డుగా పెట్టి డెలివరీ చేశారు. అదే సమయంలో 108 సిబ్బంది అక్కడికి చేరుకొని సాయం అందించారు. పండంటి ఆడబిడ్డ జని్మంచగా.. 108 వాహనంలో తల్లీబిడ్డను జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. పురుడుపోసిన ఆర్టీసీ స్వీపర్లు సైదమ్మ, స్రవంతి, లావణ్య, భవానీ, రేణుకను అధికారులు, ప్రయాణికులు అభినందించారు. కాగా తన భార్యకు డెలివరీ సమయం వచ్చే వరకు ఇటుక బట్టీ యాజమాని కూలీ డబ్బులు ఇవ్వలేదని, రేపుమాపు అంటూ దాటవేయడం వల్లే ఈ పరిస్థితి వచి్చందని కుమారి భర్త దూల ఆవేదన వ్యక్తం చేశారు. 

#

Tags : 1

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)