Breaking News

బంగారం చోరీ కేసులో మహిళ అరెస్టు

Published on Mon, 07/28/2025 - 04:39

సూర్యాపేటటౌన్‌: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీసాయి సంతోషి జ్యువెలరీ షాపులో ఈ నెల 21న రాత్రి జరిగిన భారీ చోరీ కేసులో పోలీసులు ఒక మహిళను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆమె నుంచి 14తులాల బంగారం స్వా«దీనం చేసుకున్నారు. కేసు వివరాలను జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ నరసింహ వెల్లడించారు. ఆదివారం ఉదయం పోలీసులు సూర్యాపేట హైటెక్‌ బస్టాండ్‌లో తనిఖీలు చేస్తుండగా ఖమ్మం పరిధిలోని నాయుడుపేటకు చెందిన మేకల యశోద అనుమానాస్పదంగా కనిపించింది. 

ఆమె బ్యాగును తనిఖీ చేయగా శ్రీసాయి సంతోషి జ్యువెలరీ షాపులో చోరీకి గురైన కొన్ని ఆభరణాలు లభ్యమయ్యాయి. ఆభరణాలు అమ్మేందుకు హైదరాబాద్‌కు వెళ్తూ హైటెక్‌బస్టాండ్‌లో పట్టుబడింది. ఆమెను స్టేషన్‌కు తరలించి విచారించగా బంగారం షాపులో దొంగతనం చేసిన నిందితులకు ఆశ్రయం ఇచ్చి చోరీకి సహకరించినట్టు అంగీకరించింది. దొంగలించిన బంగారం ఇక్కడ అమ్మితే అనుమానం వస్తుందని నేపాల్‌కు తీసుకెళ్లి అమ్ముదామని దొంగలు నిర్ణయించారు. 

ఈమేరకు నిందితులకు ఆశ్రయం ఇచ్చి సహకరించిన అమర్‌ బట్, మేకల యశోద ఖర్చులకు కొన్ని బంగారు ఆభరణాలు ఇచ్చి మిగతా ఐదుగురు నిందితులు నేపాల్‌కు వెళ్లిపోతున్నట్లు వారికి చెప్పారు. నిందితురాలు ఇచ్చిన సమాచారం మేరకు ప్రతక్ష్యంగా చోరీకి పాల్పడిన నేపాల్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన మొత్తం ఐదుగురిని గుర్తించామని ఎస్పీ తెలిపారు. 

నిందితులంతా ఖమ్మంలో దొంగతనాలు చేసి దొరికిపోయారని, అక్కడ చోరీ చేసే మళ్లీ దొరికిపోతామని, సూర్యాపేట పట్టణాన్ని ఎంచుకున్నారన్నారు. ఈ కేసులో జ్యువెలరీ షాపు యజమాని రెండున్నర కిలోల బంగారం, కొంత నగదు దొంగతనానికి గురైనట్టు సూర్యాపేట పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చినట్లు ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, పట్టణ సీఐ వెంకటయ్య, ఎస్‌ఐ శివతేజ తదితరులు పాల్గొన్నారు.  

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)