Breaking News

బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై మహిళ తీవ్ర ఆరోపణలు

Published on Mon, 03/27/2023 - 17:46

సాక్షి, మంచిర్యాల: బీఆర్ఎస్ నేత, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యేపై మహిళా తీవ్ర ఆరోపణలు చేశారు. తమను నమ్మించి మోసం చేశారంటూ అరిజిన్‌ పాల సంస్థ భాగస్వామి శైలజ ఆరోపించారు. తమ డబ్బులు తీసుకొని, తిరిగి తమ మీదనే కేసులు బనాయించి రిమాండ్‌కు పంపించాడని తెలిపారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో తనకు ప్రాణహాని ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఆడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆడియోలో.. ‘దుర్గం చిన్నయ్య అనే వ్యక్తిని తొలిసారి మా బ్రాంచ్‌ ఓపెనింగ్‌ రోజు కలిశాము. మీ కంపెనీలో మాకు తెలిసన వాళ్లకు షేర్స్‌ ఇవ్వండి.. మీకు ఫుల్‌ సపోర్ఠ్‌ చేస్తాను, మీకు ఏం కావాలన్నా చేసి పెడతాను అని చెప్పారు. మేము దానికి ఓకే చెప్పాము. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో తరుచూ బిజినెస్‌ పనుల కోసం మాట్లాడేవాళ్లం. కొన్నిసార్లు మాతో పాటు మా దగ్గర పనిచేసే ఒక అమ్మాయి కూడా వచ్చేది. ఒకరోజు ఎమ్మెల్యే కాల్‌ చేసి మీతోపాటు ఒక అమ్మాయి వచ్చింది కదా.. ఆమెను ఒకరోజుకు నాతో పంపిస్తారా అని అడిగారు.

ఆ అమ్మాయి అలాంటిది కాదని చెప్పాం. కానీ ఎవరో ఒక అమ్మాయిని తప్పకుండా తన దగ్గరికి పంపాలని ఎమ్మెల్యే అడిగారు. లేకపోతే మీ ఇష్టం అంటూ బెదిరించారు. దీంతో చేసేదేం లేక తెలిసిన వాళ్ల ద్వారా బ్రోకర్ల నెంబర్లు ఇస్తే మేము డైరెక్ట్‌గా ఆయనకు అప్పజెప్పాం. వాళ్లతో ఆయన టచ్‌లో ఉన్నారు. తరువాత దళితబంధు సమావేశమని మళ్లీ ఒకసారి మమ్మల్ని పిలిపించి మందు ఏర్పాటు చేశారు. నాతో బలవంతంగా తాగించేందుకు ప్రయత్నించాడు. నన్ను లైంగిక వేధింపులకు గురిచేశాడు. నేను అక్కడి నుంచి వెళ్లిపోయాను.

మా దగ్గర డబ్బులు తీసుకొని తన పర్సనల్‌ పనులకు వాడుకున్నాడు. చెప్పింది చేయకుంటే మమ్మల్ని బ్లాక్‌మెయిల్‌ చేశాడు. చాలా మోసం చేశాడు. మళ్లీ దళిత బంధు గురించే మట్లాడాలని ఒత్తిడి చేసి బెల్లంపల్లిలోని ఆయన ఇంటికి పిలిపించాడు. తరువాత ఆయన అక్కడున్న పోలీసులకు మమ్మల్ని అప్పగించి 3 రోజులు పోలీస్‌ స్టేషన్‌లో ఉంచారు. మేం ఏం తప్పులు చేయకున్నా తప్పుడు కేసులు పెట్టి పోలీసులు టార్చర్‌ చేశారు. మాకు సంబంధం లేదు అని చెబితే కూడా మీరు ఏమున్నా ఎమ్మెల్యేతో మాట్లాడుకోండి అని చెప్పారు.

ఆయన చెప్పిన దానికి ఒప్పుకోవడం లేదని నన్ను రిమాండ్‌కు పంపించారు. రిమాండ్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా రెండు తప్పుడు కేసులు పెట్టి ఇరికించారు. ఏ కేసులతో నాకు ఏలాంటి సంబంధం లేదు. తప్పుడు కేసులకు సంబంధించి మా దగ్గర అన్నీ ఆధారాలు ఉన్నాయి. వీటిని చూపిస్తుంటే కూడా పోలీసులు.. మాకు ఇవ్వన్నీ సంబంధం లేదన్నట్లు మాట్లాడుతున్నారు.  దుర్గం చిన్నయ్య, వాళ్ల మనుషుల నుంచి నాకు ప్రాణహాని ఉంది.  నాకు మీడియా సపోర్ట్‌ కావాలి. నన్ను ఈ సమస్య నుంచి బయటకు తీసుకు రావాలి’ అని శైలజ విజ్ఞప్తి చేశారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)