Breaking News

కేవలం రూ.500కే 66 గజాల ప్లాట్‌!

Published on Mon, 11/03/2025 - 20:17

సాక్షి,హైదరాబాద్‌: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ పురపాలిక పరిధిలోని గణేశ్‌నగర్‌లో ఓ చిన్నారి అదృష్టాన్ని తనవైపు తిప్పుకుంది.పది నెలల హన్సికకు రూ.16 లక్షల విలువైన 66 గజాల స్థలం,అందులో నిర్మించిన ఇల్లు కేవలం రూ.500కే లభించింది. ఆదివారం నిర్వహించిన లక్కీ డ్రాలో నిర్వాహకులు  ఆమెను విజేతగా ప్రకటించారు. దీంతో ఆ ఇంట్లో ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో హోటల్‌లో పనిచేస్తున్న శంకర్‌, తన భార్య ప్రశాంతి, కుమార్తెలు సాయి రిషిక, హన్సికల పేరుతో నాలుగు కూపన్లు కొనుగోలు చేశారు. అదృష్టం వెతుక్కుంటూ హన్సికను ఎంపిక చేసింది. లక్కీడ్రాలో హన్సిక ఎంపికైనట్లు నిర్వాహకులు తండ్రి శంకర్‌కు ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు.రూ.500కే 66గజాల స్థలం దక్కడంతో ఎగిరి గంతేసినంత పనిచేశారు.  

ఇక 66 గజాల ఇంటి స్థలం అమ్మేందుకు దాని యజమాని కంచర్ల రామబ్రహ్మం లక్కీ డ్రా నిర్వహించారు. 66 సెంట్ల స్థలం, అందులో ఉన్న ఇంటి యజమాని కంచర్ల రామబ్రహ్మం. తనకు డబ్బు అవసరమై, సంప్రదాయ రీతిని పక్కనపెట్టి వినూత్నంగా ఆస్తిని విక్రయించేందుకు రూ.500కే లక్కీ డ్రా పద్ధతిని ఎంచుకున్నారు. నవంబర్‌ 2న లక్కీ డ్రా నిర్వహించి విజేతకు ఇల్లు, స్థలం రిజిస్ట్రేషన్‌ చేస్తానని ప్రకటించారు.

ఈ ఆలోచన వినూత్నంగా ఉండటంతో 3,600 మంది తమ అదృష్టాన్ని పరీక్షించేందుకు కూపన్లు కొనుగోలు చేశారు. దీంతో రామబ్రహ్మంకు రూ.18 లక్షలు సమకూరాయి. విజేతగా హన్సిక నిలిచింది. త్వరలో యజమాని హన్సిక కుటుంబం పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయనున్నారు.

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)