Breaking News

ముప్పుతిప్పలు పెట్టిన అడవి దున్న ఎట్టకేలకు చిక్కింది...

Published on Sat, 02/08/2025 - 08:01

భువనగిరి: అటవీ శాఖ అధికారులను ముప్పుతిప్పలు పెట్టిన అడవి దున్న ఎట్టకేలకు చిక్కింది. అయితే అది మృతిచెందినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. యాదాద్రి భువనగిరి జిల్లా అటవీశాఖ అధికారి పద్మజారాణి తెలిపిన వివరాల ప్రకారం.. గత మూడురోజుల నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాలో సంచరిస్తున్న అడవి దున్నను పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు, పశువైద్యాధికారులతో కలిపి 10 బృందాలను ఏర్పాటు చేశారు. 

అడవి దున్నకు మత్తు ఇంజెక్షన్‌ ఇచ్చేందుకు వరంగల్‌ జూపార్క్‌ నుంచి వైద్యులు కూడా వచ్చారు. శుక్రవారం భువనగిరి మండలం రెడ్డినాయక్‌ తండా పరిసర ప్రాంతాల్లో అడవి దున్న సంచరిస్తున్నట్లు గుర్తించి వైద్యులు అడవి దున్నకు సమీపంలో నుంచి మత్తు ఇంజెక్షన్‌ ఇచ్చారు. దీంతో భయంతో అడవి దున్న అక్కడ ఉన్న గుట్టల పైన పరుగులు పెట్టి పడిపోయింది. 

మత్తుతో ఉన్న దున్నను వాహనంలోకి ఎక్కించే క్రమంలో పరిశీలించగా అది మృతిచెందినట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. రెండు రోజుల నుంచి పరుగులు పెడుతున్న అడవి దున్న అప్పటికే అనార్యోగానికి గురికావడంతో పాటు మత్తు  ఇంజక్షన్‌ ఇచ్చిన తర్వాత పరుగులు పెట్టడం వల్ల మృతిచెందినట్లు జిల్లా అటవీశాఖ అధికారి తెలిపింది. అడవి దున్నకు పోస్టుమార్టం నిర్వహించి ఖననం చేసినట్లు పేర్కొన్నారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)