Breaking News

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..

Published on Thu, 12/25/2025 - 04:18

మహబూబాబాద్‌ రూరల్‌: భర్త చనిపోతే ఆయనపై ఉన్న ఇంటి రుణం మాఫీ అవుతుందని, పనిలోపనిగా తమ వివాహేతర సంబంధానికి అడ్డు తొలగుతుందని ఓ మహిళ తన ప్రియుడు, మరో వ్యక్తి సహాయంతో భర్తను హత్య చేయించింది. తర్వాత హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నించగా పోలీసులు కేసును ఛేదించి నిందితులను కటకటాల్లోకి పంపారు. డీఎస్పీ ఎన్‌.తిరుపతిరావు బుధవారం ఈ కేసు వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం బోడమంచ తండాకు చెందిన కౌలురైతు భూక్య వీరన్న సోమవారం రాత్రి ఇంటినుంచి బయటకు వెళ్లాడు. 

మంగళవారం తెల్లవారుజామున బోడమంచ తండా నుంచి బేరువాడ గ్రామానికి వెళ్లే దారిలో అతని మృతదేహం కనిపించింది. మృతుడి తల్లి రంగమ్మ ఫిర్యాదు మేరకు కేసముద్రం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. భూక్య వీరన్న భార్య విజయకు అదే తండాకు చెందిన బోడ బాలోజీకి మధ్య వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో వీరన్న ఆర్థిక సమస్యలతో బాధపడుతుండగా బాలోజీ తన వ్యవసాయ భూమి అమ్మి కొన్ని అప్పులు కట్టాడు. 

ఇంకా అప్పులు మిగిలి ఉండటంతో బోడ బాలోజీ, అతని స్థలంలో అద్దెకు ఉండే ఆర్‌ఎంపీ వైద్యుడు, గూడూరు మండలం రాజనపల్లి గ్రామానికి చెందిన ధర్మారపు భరత్‌కు వీరన్న తన ఆర్థిక ఇబ్బందుల విషయాన్ని తెలియజేశాడు. దీంతో భరత్‌ ముత్తూట్‌ సంస్థలో వీరన్నకు ఇంటిపై రుణం ఇప్పించగా అదే సమయంలో రుణం తీసుకున్న వ్యక్తి ప్రమాదవశాత్తు చనిపోతే రుణం మాఫీ అవుతుందని కూడా చెప్పాడు. దీంతో విజయ, ఆమె ప్రియుడు బాలోజీ కలిసి ఎలాగైనా వీరన్నను చంపి దానిని ప్రమాదవశాత్తు చనిపోయినట్లుగా చిత్రీకరించాలని, దీనివల్ల అప్పు మాఫీతోపాటు తమ వివాహేతర సంబంధానికి అడ్డు కూడా తొలగుతుందని భావించారు. 

ఈ క్రమంలో ఆర్‌ఎంపీ వైద్యుడు భరత్‌ సహాయం తీసుకుని సోమవారం రాత్రి వీరన్నను మద్యం సేవిద్దామని చెప్పి బాలోజీ.. తండా బయట ఉన్న పామాయిల్‌ తోట వద్దకు పిలిచాడు. ముగ్గురూ కలిసి మద్యం తాగాక పథకం ప్రకారం బాలోజీ తనవెంట తెచ్చుకున్న ఇనుప రాడ్డుతో వీరన్న తల వెనుక బలంగా కొట్టడంతో కిందపడ్డాడు. భరత్‌ టవల్‌తో ముక్కు, నోరుమూసి చనిపోయాక దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించడానికిగాను బేరువాడ వెళ్లే రోడ్డు పక్కన పొలంలో మృతుడి ద్విచక్ర వాహనంతో సహా పడేశారు. 

కేసు విచారణలో భార్య విజయ తీరుపై అనుమానం వచ్చిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా హత్యగా తేలింది. దీంతో విజయ, ఆమె ప్రియుడు బాలోజీ, ఆర్‌ఎంపీ భరత్‌ను అరెస్టు చేశామని డీఎస్పీ తెలిపారు. 24 గంటల్లోనే కేసును ఛేదించిన కేసముద్రం సీఐ సత్యనారాయణ, ఎస్సై క్రాంతికిరణ్, రెండవ ఎస్సై నరేశ్, సిబ్బందికి ఎస్పీ డాక్టర్‌ శబరీశ్‌ అభినందనలు తెలిపారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)