Breaking News

జుట్టు రాలుతోందని క్లినిక్‌కు వెళితే..

Published on Fri, 12/19/2025 - 11:05

బంజారాహిల్స్‌: జుట్టు రాలుతుందని క్లినిక్‌కు వెళితే తనకు అనారోగ్య సమస్యలు తెచ్చిపెటారంటూ ఓ బాధితుడు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. హఫీజ్‌బాబానగర్‌లో నివసించే అప్జల్‌ తౌఫీక్‌ అహ్మద్‌ (45) జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నాడు.  తెలిసిన వారి ద్వారా కస్టమర్‌ కేర్‌ నెంబర్‌ తీసుకుని వారిని సంప్రదించాడు. బంజారాహిల్స్‌ రోడ్డునెంబర్‌–14లో ఉన్న రాయన్‌ క్లినిక్‌కు రావాలని వారు సూచించారు.  

తమ క్లినిక్‌ ను.. ఉత్తమ టర్కీ హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ క్లినిక్‌గా వారు చెప్పుకొచ్చారు. దీనిని నమ్మిన అప్జల్‌ తౌఫీక్‌ సదరు క్లినిక్‌కు వెళ్లి రిసెప్షన్‌లో ఉన్న మమత అనే మహిళతో  తన సమస్య గురించి వివరించాడు. మీ సమస్య పరిష్కారానికి పీఆర్‌పీ హెయిర్‌ ట్రీట్‌మెంట్‌ చేయాల్సి ఉంటుందని, అందుకోసం నెలకు రూ.1500 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని, అలా ఆరు నెలల పాటు చికిత్స చేయించుకోవాలని  సూచించింది. దీనికి అంగీకరించిన అతనికి అదే రోజు ప్రవీణ్‌ అనే ల్యాబ్‌ టెక్నీషియన్‌ చికిత్స ప్రారంభించారు.

 చికిత్స చేసే సమయంలో అతనికి తీవ్రమైన తలనొప్పి రావడంతో ఆ విషయాన్ని వారికి తెలియజేయగా, ఏమీ కాదని చెప్పి అక్కడి నుంచి పంపించివేశారు. అయితే అప్పటినుంచి అప్జల్‌ తౌఫీక్‌కు తలనొప్పి తగ్గకపోగా వాంతులు, చేతులు మొద్దుబారడం వంటి సమస్యలతో బాధపడుతున్నాడు. నకిలీ డాక్టర్, క్లినిక్‌ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తనకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యాయని పేర్కొంటూ వారిపై తగిన చర్యలు తీసుకోవాలని బాధితుడు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)