Breaking News

హృద్యంగా.. సరికొత్తగా..

Published on Sun, 08/17/2025 - 06:15

సాక్షి, హైదరాబాద్‌: వారంతా సరికొత్త హృదయాలతో కొంగొత్త జీవనం గడుపుతున్నారు.. కానీ ఆ పునర్జన్మ పొందేందుకు పడిన కష్టనష్టాలు, వ్యయప్రయాసలు తమ లాంటి వైద్య పరిస్థితి ఎదుర్కొంటున్న వారికి రాకూడదని నిర్ణయించుకున్నారు. అందుకే గుండె మార్పిడి శస్త్రచికిత్సల కోసం నిరీక్షిస్తున్న రోగుల కోసం నిరంతరం హార్ట్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్ల సంబంధ సమాచారం అందించేందుకు వీలుగా హారి్టయెస్ట్‌ పీపుల్‌ పేరిట ఓ వాట్సాప్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా గుండె మార్పిడి ఆపరేషన్లు చేయించుకున్న 240 మంది వ్యక్తులు, వారి కుటుంబీకులు కలిసి దీన్ని నిర్వహిస్తున్నారు. గుండె మార్పిడికి ముందు, ఆ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల వివరాలను ఎప్పటికప్పుడు గ్రూప్‌లో షేర్‌ చేస్తూ రోగులు, వారి కుటుంబ సభ్యులకు చేదోడువాదోడుగా నిలుస్తున్నారు. 

కీలక సమయంలో సహాయం.. 
గ్రూప్‌ వ్యవస్థాపక సభ్యురాలు, గ్రూప్‌ అడ్మిన్లలో ఒకరైన ముంబైకి చెందిన ఆర్మైటీ హోమి ఇందులో కీలకంగా వ్యవహరిస్తున్నారు. పదేళ్ల క్రితం గుండె మార్పిడి ఆపరేషన్‌ కోసం తన కుమార్తెను ఎయిర్‌ అంబులెన్స్‌లో చెన్నైకి తరలించే క్రమంలో ఎదురైన సమస్యలు, సవాళ్లు ఇతర రోగులకు ఎదురవకుండా చూసేందుకే వాట్సాప్‌ గ్రూప్‌కు శ్రీకారం చుట్టినట్లు ఆమె పేర్కొన్నారు. ‘చాలా మంది గుండె, ఇతర అవయవాల మార్పిడి కోసం చిన్న పట్టణాల నుంచి ముంబై, ఢిల్లీ, చెన్నై వంటి మహానగరాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ కీలక సమయంలోనే మా గ్రూప్‌ సభ్యులు అవసరమైన సహాయం చేస్తారు’అని హోమి వివరించారు. ఐఐటీ బాంబే మాజీ ప్రొఫెసర్, ఏడేళ్ల క్రితం గుండె మార్పిడి చేయించుకున్న డా. వినీ కిర్పాల్‌ సైతం ఈ గ్రూప్‌లో చేరారు.

తనకు ఎదురైన అనుభవాల సారంతో ఇప్పటికే ‘న్యూ లైఫ్‌ న్యూ బిగినింగ్స్‌’పుస్తకం ద్వారా అవయవ గ్రహీతలు, దాతలు, అవయవ మార్పిడి వైద్యుల విశ్లేషణలు, అభిప్రాయాలను వినీ కిర్పాల్‌ వెలుగులోకి తీసుకొచ్చారు. మరో గ్రూప్‌ సభ్యురాలు, కిడ్నీ గ్రహీత జయ జైరామ్‌.. 28 ఏళ్లకుపైగా అవయవదాన రంగంలో కీలకపాత్ర పోషిస్తున్న మోహన్‌ ఫౌండేషన్‌ (మల్టీ ఆర్గాన్‌ హార్వెస్టింగ్‌ ఎయిడ్‌ నెట్‌వర్క్‌) ముంబై విభాగానికి ప్రాజెక్ట్‌ కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. బ్రెయిన్‌ డెడ్‌కు గురయ్యే రోగుల కుటుంబాలను అవయవదానానికి ప్రోత్సహించడంపై ఆమె దృష్టిపెట్టారు. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు