Breaking News

కబ్జా స్థలాల్ని స్వాదీనం చేసుకుంటాం

Published on Fri, 08/01/2025 - 00:27

సాక్షి, హైదరాబాద్‌: ఆక్రమణలకు గురైన తమ శాఖ భూముల్లో అంగుళం స్థలాన్ని కూడా వదలిపెట్టకుండా యుద్ధప్రాతిపదికన స్వాదీనం చేసుకుంటామని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. రూ. వందల కోట్ల విలువైన భూములు కబ్జాలకు గురయ్యాయని.. దీన్ని ఉపేక్షించకుండా కఠినంగా వ్యవహరిస్తామన్నారు. భవిష్యత్తులో ఆక్రమణలకు చెక్‌ పెట్టేందుకు ఆ భూముల చుట్టూ కంచెల ఏర్పాటుతోపాటు చట్టపరమైన చర్యలూ తీసుకుంటామని చెప్పారు. 

నీటిపారుదల శాఖ భూముల పరిరక్షణపై సచివాలయంలో గురువారం ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శి, ఈఎన్సీ (జనరల్‌) అంజాద్‌ హుస్సేన్, ఈఎన్సీ అడ్మిన్‌ రమేశ్‌ బాబు, భూసేకరణ కమిషనర్‌ శివకుమార్‌ నాయుడు హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌తో మంత్రి ఉత్తమ్‌ సమీక్ష నిర్వహించారు. కాల్వలకు ఇరువైపులా ఉన్న భూములతోపాటు ప్రాజెక్టుల స్థలాల్లో సౌర విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు.  

కోర్టుల్లో వాదనలకు ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాది.. 
హైదరాబాద్‌లోని గండిపేట, రాజేంద్రనగర్‌ పరిధిలోని హిమాయత్‌సాగర్, కిస్మత్‌పుర, వాలంతరి, ఇంజనీరింగ్‌ ల్యాబ్‌ (టీజీఈఆర్‌ఎల్‌)కు చెందిన 426.3 ఎకరాలకుగాను 131.31 ఎకరాలు కబ్జాకు గురైనట్లు గుర్తించామని మంత్రి ఉత్తమ్‌ తెలిపారు. ఐటీఐఆర్‌ అ«దీనంలోని 81.26 ఎకరాల స్థలంపై కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా మిగిలిన 50.13 ఎకరాలు కబ్జాకు గురయ్యాయన్నారు. 

వాటిపై జిల్లా కోర్టులో 20 కేసులు, హైకోర్టులో 2 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు వివరించారు. భూముల పరిరక్షణలో న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాదిని నియమించాలని నిర్ణయించామన్నారు. ఈ భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు నీటిపారుదల శాఖ, హైడ్రా, రెవెన్యూ, ఆర్‌ అండ్‌ ఆర్‌ అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించామని చెప్పారు. 

నీటిపారుదల భూముల్ని గుర్తించండి.. 
నీటిపారుదల శాఖ ప్రాజెక్టులకు సంబంధించిన క్వార్టర్లలో అక్రమంగా నివసిస్తున్న వారిని ఖాళీ చేయించి తక్షణమే సమగ్ర సమాచారం తన ముందు ఉంచాలని మంత్రి ఉత్తమ్‌ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా నీటిపారుదల శాఖ భూములను సత్వరం గుర్తించాలన్నారు. తమ శాఖ భూముల్లో సౌర విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుపై ఇటీవలి మంత్రివర్గ సమవేశంలో చర్చించామన్నారు. దీంతో రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాలకు అవసరమైన విద్యుత్‌ను నీటిపారుదల శాఖ స్వయంగా ఉత్పత్తి చేసుకోవచ్చని చెప్పారు.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)