Breaking News

రాష్ట్రంలోని అన్ని దేవాలయాలకు విజయ నెయ్యి

Published on Mon, 09/23/2024 - 04:36

లాలాపేట (హైదరాబాద్‌): రాష్ట్రంలోని అన్ని దేవాలయాలకు అవసరమైన నెయ్యిని విజయ డెయిరీ ద్వారానే సరఫరా చేయాలని ఆదేశాలిచ్చామని తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య (విజయ డెయిరీ) నూతన చైర్మన్‌ గుత్తా అమిత్‌రెడ్డి అన్నారు. విజయ డెయిరీ పాలు, పాల ఉత్పత్తుల అమ్మకాలను మరింత పెంచడానికి ముఖ్యమంత్రి ఆదేశాలతో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు, సంక్షేమ హాస్టళ్లకు, పాఠశాలలకు, జైళ్లు, హాస్పిటల్స్‌కు అవసరమైన పాలు, పాల పదార్ధాలు సరఫరా చేయాలని ఆయన సూచించారు.

పాడి రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ సహకారంతో పెండింగ్‌ పాల బిల్లులను త్వరలో చెల్లించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం లాలాపేటలోని విజయ భవన్‌లో ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న విజయ డెయిరీ పాలు, పాల ఉత్పత్తులను ఆదరించి తెలంగాణ రాష్ట్ర పాడి రైతులను, పాడిపరిశ్రమను బలపరచాలనీ కోరారు.  

పాల సేకరణ ధరను మూడు పర్యాయాలు పెంచాం 
రాష్ట్రంలోని 32 జిల్లాలోని 40,445 పాడి రైతుల నుంచి 6,148 పాల సేకరణ కేంద్రాల ద్వారా ప్రతి రోజూ సుమారు 4.20 లక్షల లీటర్ల పాలను సేకరిస్తున్నట్లు అమిత్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో నెలకొన్న పాల కొరతను అధిగమించేందుకు 2022 ఫిబ్రవరి నుంచి 2023 సెపె్టంబర్‌ వరకు పాల సేకరణ ధరను దేశంలో ఎక్కడాలేని విధంగా 3 పర్యాయాలు రూ. 12.48 పైసలు పెంచామన్నారు. దీంతో పాల సేకరణ గణనీయంగా పెరిగిందన్నారు.

అయినప్పటికీ కొన్ని పొరుగు రాష్ట్రాలకు చెందిన కోఆపరేటివ్‌ డెయిరీలు, ప్రైవేట్‌ డెయిరీలు పాల సేకరణ ధరలు తగ్గించడంతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ఆవు పాలను తక్కువ ధరకు రూ. 26 నుంచి రూ. 34లకే కొని ఇక్కడ తక్కువ ధరకు అమ్మకాలు చేపట్టాయని, దీంతో తెలంగాణ విజయ డెయిరీ ఉత్పత్తులకు గిరాకీ తగ్గిందన్నారు. అందుకే పాడి రైతుల బిల్లులు చెల్లింపులో కొంత జాప్యం జరిగిందని, దీన్ని నివారించేందుకు చర్యలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)