Breaking News

ఎలక్ట్రిక్‌ బస్సుల నిర్వహణలో ఆర్టీసీకి సహకరిస్తాం

Published on Fri, 05/03/2024 - 04:38

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీలో ఎలక్ట్రిక్‌ బస్సుల నిర్వహణకుగాను యూకే తరపున ఆర్థికంగా, సాంకేతికంగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ గారెత్‌ విన్‌ ఓవెన్‌ ప్రకటించారు. గురువారం ఆయన బస్‌భవన్‌లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఇతర అధికారులతో భేటీ అయ్యారు.

 గతేడాది గోవాలో జరిగిన జీ–20 దేశాల మంత్రుల సమావేశం సందర్భంగా  భారత్‌లో పర్యావరణహిత బస్సుల నిర్వహణకు సహకరించేందుకు యూకే, యూఎస్‌లు ముందుకొచ్చి భారత్‌తో ఒప్పందం చేసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. జీరో ఎమిషన్‌ వెహికిల్‌ పైలట్‌ ప్రాజెక్టు నిర్వహణలో భాగంగా ఆర్టీసీ అధికారులతో చర్చించేందుకు బస్‌భవన్‌కు వచ్చినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో ఎలక్ట్రిక్‌ బస్సుల నిర్వహణ అభినందనీయమని, వాటి సంఖ్య మరింత పెరగాల్సి ఉందని, ఈ విషయంలో ఆర్థిక, సాంకేతిక తోడ్పాడుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు.

ఎలక్ట్రిక్‌ బస్సులను నిర్వహిస్తున్న తీరును ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో బ్రిటిష్‌ హైకమిషనర్‌ సీనియర్‌ అడ్వయిజర్‌ జావైద్‌ మల్లా, తెలంగాణ ప్రభుత్వ ఆటోమోటివ్‌ అండ్‌ ఈవీ సెక్టార్‌ డైరెక్టర్‌ గోపాలకష్ణ, టీఎస్‌ఆర్టీసీ సీఓఓ డాక్టర్‌ రవీందర్, జాయింట్‌ డైరెక్టర్‌ అపూర్వరావు, డబ్ల్యూఆర్‌ఐ ఇండియా ప్రతినిధి చైతన్య కనూరి, యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాకు చెందిన అనన్య బెనర్జీ తదితరులు పాల్గొన్నారు. 

#

Tags : 1

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య