Breaking News

ప్రమాణాలతో వైద్య విద్యను అందిస్తున్నాం

Published on Fri, 06/21/2024 - 04:37

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణాలతో కూడిన విద్య వైద్యను అందిస్తోందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం హైదరాబాద్‌ రాజ్‌భవన్‌ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆల్బెండజోల్‌ మాత్రలను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పిల్లల శారీరక ఎదుగుదలకు డీవార్మింగ్‌ టాబ్లెట్లు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. 

ప్రభుత్వం ప్రజల సంక్షేమం, విద్య, వైద్యానికి కోట్ల రూపాయలు వెచ్చిస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా స్కూల్‌ విద్యార్థులకు స్వయంగా డీవార్మింగ్‌ టాబ్లెట్లను మంత్రులు దామోదర, పొన్నం ప్రభాకర్‌ వేశారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 95 లక్షల ఆల్బెండజోల్‌ మాత్రలను అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో 1 నుంచి 19వ సంవత్సరాల వయసు గల పిల్లలకు అందిస్తున్నామన్నారు. 

గురువారం నుంచి జూన్‌ 27 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆరోగ్యం కోసం యోగాను దినచర్యలో భాగంగా చేసుకోవాలని, మన పూరీ్వకులు ఆరోగ్యం కోసం యోగాను వారసత్వంగా అందించారని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్‌ కుమార్‌ యాదవ్, స్థానిక శాసనసభ్యులు దానం నాగేందర్, రాజ్‌భవన్‌ కార్యదర్శి బుర్రా వెంకటేశం, వాకాటి కరుణ, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్, కలెక్టర్‌ అనుదీప్‌ దురశెట్టి పాల్గొన్నారు. 

Videos

అసెంబ్లీలో PS రాజుకు గుండెపోటు.. CPR చేసిన మంత్రి శ్రీహరి

ఎందుకంత ఆవేశం.. నీ తల్లిననలేదు.. హరీష్ రావు పై స్పీకర్ ఆగ్రహం ..

Super Elnino: వెడ్డెక్కుతున్న పసిఫిక్ మహాసముద్రం...భారత్ కు ముప్పేనా?

FIRST WEEKలో నామినేట్ అయ్యింది వీళ్లే?

వామ్మో అన్ని కోట్లా? నాగార్జున రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

మెగా DSCలో అక్రమాలను కప్పిపుచ్చలేక అధికారుల తంటాలు

ఆక్వా రైతులకు మరోసారి బిగ్ షాక్

ఈ లాజిక్ ఎలా మిస్సయ్యావ్ లోకేష్ ఇక నీ చాప్టర్ క్లోజ్..

అన్నాచెల్లెళ్ల టీచర్ జాబ్.. బయటపడ్డ నకిలీ సర్టిఫికెట్ల బాగోతం

DSC అక్రమాల పుట్ట గుట్టురట్ట

Photos

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)