Breaking News

జీహెచ్‌ఎంసీ చరిత్రలోనే మొదటిసారి.. కౌన్సిల్‌ సమావేశం రసాభాస

Published on Wed, 05/03/2023 - 13:46

సాక్షి, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశం రసాభాసగా మారింది. జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశాన్ని అధికారులు బహిష్కరించారు. జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్లు, వాటర్‌ బోర్డు అధికారులు బయటకు వెళ్లిపోయారు. జీహెచ్‌ఎంసీ చరిత్రలోనే మొదటిసారిగా అధికారులు బాయ్‌కాట్‌ చేశారు. 

వివరాల ప్రకారం.. నగరంలో వర్షాల నేపథ్యంలో జరిగిన పరిణామాలపై బీజేపీ కార్పొరేటర్లు తీవ్ర విమర్శలు చేశారు. అలాగే సమావేశాలకు కూడా బీజేపీ కార్పోరేటర్లు వినూత్న వేషధారణతో నిరసనలకు దిగారు. ఈ నేపథ్యంలో బీజేపీ కార్పొరేటర్ల తీరుపై అధికారులు నిరసన తెలిపారు. ఈ క్రమంలో బీజేపీ కార్పొరేటర్లు గొడవ చేస్తున్నారంటూ సమావేశాం నుంచి జలమండలి అధికారులు సమావేశాన్ని బహిష్కరించారు. దీంతో, వారికి మద్దతుగా జీహెచ్‌ఎంసీ అధికారులు నిలిచి సమావేశాన్ని బాయ్‌కాట్‌ చేశారు. అయితే, గతంలో విపక్ష కార్పొరేటర్లు మాత్రమే సమావేశాలను బహిష్కరించేవారు. తాజాగా అధికారులే సమావేశాలను బాయ్‌కాట్‌ చేశారు. కాగా, జీహెచ్‌ఎంసీ చరిత్రలోనే అధికారులు బాయ్‌కాట్‌ చేయడం ఇదే మొదటిసారి. 

అనంతరం బీజేపీ కార్పొరేటర్లు మీడియాతో​ మాట్లాడుతూ.. ప్రశ్నలు అడిగతే అధికారుల పారిపోయారని ఎద్దేవాచేశారు. పిల్లలు చనిపోతున్నారని నిరసన తెలిపితే మాపై కేసులు పెడతారా?. అధికారులు మమ్మల్ని కాదు.. మేయర్‌ను అవమానించారు అంటూ కామెంట్స్‌ చేశారు. ఈ క్రమంలో మేయర్‌ విజయలక్ష్మీ సీరియస్‌ అయ్యారు. అధికారులకు సిగ్గులేదా? అని మాట్లాడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇది కూడా చదవండి: విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఎస్సై, డ్రైవర్‌ దుర్మరణం.. 

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)