Breaking News

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ శ్వేత మృతికి అల్లుడే కారణం..!

Published on Mon, 01/26/2026 - 13:47

గీసుకొండ/నెక్కొండ: కేరళలో వరంగల్‌ జిల్లాకు చెందిన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి బంధువులు, స్థానికుల కథనం ప్రకారం.. వరంగల్‌ జిల్లా నెక్కొండ మండలం సూరిపల్లి గ్రామానికి చెందిన సింగారపు కుమారస్వామి, మంజుల దంపతుల కూతురు శ్వేత (25)కు రెండేళ్ల క్రితం సంగెం మండలం కుంటపల్లికి చెందినసీ  సీఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ జంగం విక్రంతో వివాహం జరిగింది. ఉద్యోగరీత్యా విక్రం కేరళలో విధులు నిర్వర్తిస్తుండగా బీటెక్‌ చదివిన శ్వేత అక్కడే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తోంది. 

వారి మధ్య గొడవలు జరుగుతుండేవని, ఈనెల 21న శ్వేత బావిలో దూకి ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఆదివారం గ్రేటర్‌ వరంగల్‌ 16వ డివిజన్‌ జాన్‌పాకలోని విక్రం ఇంటికి తీసుకొచ్చారు. తన కూతురు      మృతికి అల్లుడే కారణం అంటూ మృతురాలి బంధువులు, సూరిపల్లి గ్రామస్తులు అతడి ఇంటిపై దాడి చేశారు. 

కొట్టడంతోపాటు ఇంటిలోని సామగ్రిని ధ్వంసం చేశారు. న్యాయం జరిగే వరకు కదిలేది లేదంటూ మృతదేహంతో అక్కడే నిరసన తెలిపారు. విక్రంకు సంబంధించిన జాన్‌పాక, కుంటపల్లిలోని ఆస్తిని మృతురాలి బంధువులకు రాసి ఇవ్వాలంటూ పట్టుబట్టి అంగీకార పత్రం రాయించుకున్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న గీసుకొండ సీఐ విశ్వేశ్వర్, ఎస్సై కు మార్, సిబ్బంది వెళ్లి గొడవ చేస్తున్న వారికి నచ్చజెప్పి శాంతింపజేశారు. చివరికి రాత్రి బంధువులు శ్వేత మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి సూరిపల్లికి  తీసుకెళ్లారు.

 

Videos

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు