Breaking News

నలుగురు పిల్లల తల్లి.. భర్త కాదని ప్రియుడితో..!

Published on Tue, 07/22/2025 - 13:59

వరంగల్: నలుగురు పిల్లల తల్లి (ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు).. తనకు భర్త వద్దు.. ప్రియుడే కావాలని పంచాయితీ పెద్దలకు చెప్పడంతో వారు ఆమె ఇష్టం ప్రకారం ప్రియుడుతోనే పంపించిన ఘటన మండలంలోని షోడాషపల్లి శివారు పిట్టలగూడెంలో ఇటీవల జరిగింది. భర్త కాలియ శంకర్‌ తెలిపిన కథనం ప్రకారం.. తనకు చంద్రమ్మతో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. మాకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఏడాది క్రితం లోక్యాతండా గ్రామ పంచాయతీ శివారు వేపలగడ్డ తండాకు చెందిన అజ్మీరా రాజుతో చంద్రమ్మకు వివాహేతర సంబంధం ఏర్పడింది. 

మూడు నెలల క్రితం చంద్రమ్మ, రాజు కలిసి పారిపోగా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఇద్దరిని పట్టుకొచ్చారు. అనంతరం ఇరు కుటుంబాలు పెద్దలు పంచాయితీలో మాట్లాడుకుంటామని పోలీసులకు  చెప్పారు. దీంతో కులపెద్దలు చంద్రమ్మను తన తల్లిగారి గ్రామమైన చిల్పూరు మండలం వెంకటాద్రిపేటకు పంపించారు. అయితే మళ్లీ చంద్రమ్మకు రాజు మాయమాటలు చెప్పి తన వెంట తీసుకువెళ్లాడు. వారంక్రితం రాజు, చంద్రమ్మ వేపలగడ్డ తండాకు వచ్చారనే విషయం తెలుసుకున్న భర్త శంకర్‌ కుటుంబ సభ్యులు తండాకు వెళ్లి రాజును, చంద్రమ్మను చితకబాదారు. 

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి గొడవ జరుగకుండా నిలువరించారు. ఇరువురికి తీవ్ర గాయాలు కాగా వెంటనే చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం చంద్రమ్మ రాజుతోనే ఉంటానని కుటుంబ సభ్యులకు తెగేసి చెప్పి అతడితోనే వెళ్లిపోయింది. తనకు తన భార్య కావాలని, తల్లి కోసం పిల్లలు ఏడుçస్తున్నారని భార్యను తనకు అప్పగించాలని భర్త శంకర్‌ పోలీసులను వేడుకున్నాడు. 

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)