Breaking News

SRSP Canal: కడసారి చూపుకోసం కదిలొచ్చిన గ్రామస్తులు

Published on Mon, 03/10/2025 - 11:02

సాక్షిప్రతినిధి, వరంగల్‌:  తన కళ్లెదుటే కుటుంబం మొత్తం నీటిలో పడి మృత్యుఒడికి చేరి అంత్యక్రియలకు వెళ్తుంటే ఆ తల్లి గుండెలవిసేలా రోదించింది. భర్త, ఇద్దరు పిల్లలు చనిపోవడంతో ఇక తనకు దిక్కెవరంటూ దిక్కులు పిక్కటిళ్లేలా రోదించింది.   తన ముద్దుల చిన్న కొడుకు, మనమడు, మనుమరాలు ఇక లేరని తెలిసి.. వారి మృతదేహాలను శ్మశాన వాటికకు తీసుకెళ్తుంటే వృద్ధ దంపతులు బోరున విలపించారు.

తాము ఇక ఎవరి కోసం బతకాలంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు. శనివారం వరంగల్‌ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లిలోని ఎస్సారెస్పీ కాల్వలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో మృతి చెందిన సోమారపు ప్రవీణ్‌ కుమార్, తన పిల్లలు చైత్ర, ఆర్యవర్ధన్‌  అంత్యక్రియలు ఆదివారం వారి స్వగ్రామం మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లిలో అశ్రునయనాల మధ్య జరిగాయి. ‘నాకు తలకొరివి పెట్టాల్సిన కొడుకుకు నేనే తలకొరివి పెట్టాల్సిన దుస్థితిని తీసుకొచ్చావా దేవుడా’ అంటూ మృతుడి తండ్రి సారంగపాణి రోదనలు మిన్నంటాయి. అంతిమ యాత్రలో చివరగా ముగ్గురికి కన్నీటి వీడ్కోలు పలికేందుకు గ్రామం మొత్తం కదిలొచ్చింది.

‘అర్ధ గంటలో ఇంట్లో ఉంటానంటివి గద బిడ్డో....అంటూ’

ప్రవీణ్‌కుమార్‌తో చదువుకున్న అతడి స్నేహితులు ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి కడసారి చూపుకోసం మేచరాజుపలి్లకి తరలిచ్చారు. కేరళ నుంచి యుగేంధర్, హైదరాబాద్‌ నుంచి బెల్లు శ్రీను, నాళ్లం హరికిషన్‌ ప్రసాద్‌ తదితరులు వచ్చారు. అంతిమయాత్రలో ముగ్గురిని ఒకేసారి శ్మశాన వాటికకు తీసుకెళ్తుంటే గ్రామం మొత్తం బోరుమంది. తండ్రి, పిల్లల మృతదేహాలకు పలువురు నాయకులు పూలమాల  ఝవేసి నివాళులరి్పంచారు. 

#

Tags : 1

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)