Breaking News

21ఏళ్లుగా వారిదే పాలన.!

Published on Fri, 11/28/2025 - 12:19

వరంగల్‌ జిల్లా : వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలంలోని కొనాయమాకుల సర్పంచ్‌లుగా డోలె రాధ–చిన్ని దంపతులు రికార్డు సృష్టించారు. వారిద్దరే సుమారు 21 సంవత్సరాల పాటు   గ్రామాన్ని పాలించడం విశేషం. కొనాయమాకుల గతంలో గీసుకొండ గ్రామపంచాయతీ పరిధిలో ఉండేది. 1994లో ప్రత్యేక పంచాయతీగా ఏర్పడింది.1995లో జరిగిన ఎన్నికల్లో తొలి సర్పంచ్‌గా డోలె రాధ ఎన్నికయ్యారు. మళ్లీ 2001లో మరోసారి సర్పంచ్‌గా గెలుపొంది 2006 వరకు పాలన సాగించారు. 

అనంతరం జరిగిన ఎన్నికల్లో డోలె రాధ భర్త చిన్ని, డోలె రాజేశ్వర్‌రావుతో పోటీ పడి ఓడిపోయాడు. 2006 నుంచి 2011 వరకు ఐదేళ్ల పాటు రాజేశ్వర్‌రావు సర్పంచ్‌గా కొనసాగారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో చిన్ని  మరో మారు రాజేశ్వర్‌రావుతో పోటీ పడి సర్పంచ్‌గా గెలుపొంది 2018 వరకు పదవిలో కొనసాగారు.   తర్వాత ఆయన భార్య రాధకు పోటీ చేసే అవకాశం దక్కడంతో ఆమె గెలుపొంది  2019–2024 వరకు సర్పంచ్‌గా కొనసాగారు. ఈ సారి సర్పంచ్‌ పదవి జనరల్‌ (అన్‌ రిజర్వ్‌డ్‌) కు కేటాయించడంతో చిన్ని  మరోమారు సర్పంచ్‌ పదవికి పోటీ చేస్తానని చెబుతున్నాడు. ఈ సారి ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే. 

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)