Breaking News

ఓరుగల్లు సిగలో లోహవిహంగ నగ

Published on Wed, 04/02/2025 - 04:30

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: వరంగల్‌ మామునూరు విమానాశ్రయానికి మళ్లీ మంచి రోజులు వచ్చాయి. సుమారు 44 ఏళ్ల క్రితం మూతపడిన ఈ విమానా శ్రయం నుంచి మళ్లీ విమానం ఎగిరేందుకు కార్యా చరణ సిద్ధమైంది. ఈ విమానాశ్రయం పునరుద్ధ రణతో హైదరాబాద్‌ తర్వాత రాష్ట్రంలోనే అతి పెద్ద నగరంగా పేరున్న వరంగల్‌ అభివృద్ధిలో మరింత ప్రగతి సాధించనుంది. 

కాకతీయ మెగా జౌళిపా ర్కు, ఐటీ పరిశ్రమలు ఏర్పడటం.. యునెస్కోతో రామప్ప అంతర్జాతీయ పర్యాటక కేంద్రం కావడం.. ఇలా ఒక్కొక్కటిగా వస్తున్న ప్రాజెక్టులు ఓరుగల్లు ప్రతిష్టను పెంచుతున్నాయి. సుమారు 44 ఏళ్ల తర్వాత తెలంగాణలో రెండో ప్రాంతీయ విమా నయాన కేంద్రంగా రూపుదిద్దుకోబోతుండగా.. భవిష్యత్‌ అభివృద్ధిపై ఆశలు చిగురిస్తున్నాయి. 

అర్ధ శతాబ్దం, ఆకాశయానం... 
1930లో మామునూరు ప్రాంతంలో నిర్మించిన ఈ విమానాశ్రయం, నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ ఆధ్వర్యంలో ప్రారంభం కాగా.. సోలాపూర్‌ వ్యాపార అభివృద్ధి, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ కాగిత పరిశ్రమ, వరంగల్‌ అజంజాహీ మిల్స్‌ అవసరాలకు సేవలు అందించేది. 1981 వరకు.. సుమారు అర్ధశతాబ్దం అనేక మంది ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు తమ పర్యటనలకు ఈ విమానాశ్రయాన్ని ఉపయోగించుకున్నారు. ఇండో–చైనా యుద్ధ సమయంలో ఢిల్లీ విమానాశ్రయాన్ని శత్రువులు లక్ష్యంగా చేసుకున్న సమయంలో కూడా, ఈ విమానాశ్రయం ప్రయాణికులకు సేవలు అందించింది. 

అయితే 1981లో వివిధ కారణాలతో ఈ విమానాశ్రయం మూత పడింది. మళ్లీ తెరిచేందుకు ప్రయత్నాలు జరిగినా ఫలితం లేకపోగా.. సీఎం రేవంత్‌రెడ్డి చొరవతో మామునూరు ఎయిర్‌పోర్ట్‌ పునరుద్ధ రణకు లైన్‌క్లియర్‌ అయ్యింది. ఇంతకాలం అడ్డంకిగా ఉన్న హైదరాబాద్‌ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహించే జీఎంఆర్‌ గ్రూప్‌ నుంచి ‘నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌’ (ఎన్‌ఓసీ) ఇవ్వడంతో మార్గం సుగమం అయ్యింది. పున రుద్ధరణకు విమానాశ్రయం డీపీఆర్‌ను సిద్ధం చేసే పనిలో ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నిమగ్నమైంది. 

కొత్త ఎయిర్‌పోర్టులో ఇవీ..
ఎయిర్‌బస్‌ ఎ–320, బోయింగ్‌ బీ–737 వంటి వైడ్‌–బాడీ విమానాలను ఉంచడానికి కొత్త రన్‌వే నిర్మించనున్నారు. విమానాశ్రయాన్ని సిగ్నల్‌ టవర్, భద్రతా వ్యవస్థలు, ఇతర కీలకమైన మౌలిక సదుపాయాలతో అప్‌గ్రేడ్‌ చేస్తారు. ఈ విమానాశ్రయం ప్రారంభంలో ముంబై, ఢిల్లీ, తిరుపతి, బెంగళూరు, విజయవాడ వంటి నగరాలకు దేశీయ మార్గాలను అందిస్తుంది. భవి ష్యత్తు ప్రణాళికల్లో భాగంగా ఈ విమానాశ్రయం చివరికి అంతర్జాతీయ ప్రయా ణికులు, కార్గో సేవలను అందిస్తుంది. 

కాగా, రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు దగ్గరగా ఉండటం వల్ల ఇతర జాతీయ, అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుల కనెక్టివిటీ, తద్వారా ఆర్థిక వృద్ధికి అవకాశాలు మెండు. రద్దీగా ఉండే హైదరాబాద్‌ నగరంపై ఒత్తిడిని తగ్గించడానికి కూడా వరంగల్‌ను అభివృద్ధి చేయడం ఒక మార్గంగా ప్రభుత్వాలు భావి స్తున్నాయి. 

అంతేగాకుండా వరంగల్‌ చారిత్రక ప్రాముఖ్యతను ప్రోత్సహించడానికి, స్థిరమైన అభివృద్ధి సాధనకు ప్రభుత్వం వరంగల్‌ను సుందర నగరం (స్మార్ట్‌సిటీ), హెరిటేజ్‌ సిటీ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఆగ్మెంటేషన్‌ యోజన (హృదయ్‌) వంటి పథకాల అమలు.. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ), కాకతీయ యూనివర్సిటీ (కేయూ), కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ (కేఎన్‌ఆర్‌)లున్న వరంగల్‌లో విద్య, వైద్యం, ఐటీ, పరిశ్రమల రంగాల అభివృద్ధికి ఎయిర్‌పోర్ట్‌ మరింత దోహదపడుతుంది.

మున్ముందు ఎన్నో ప్రయోజనాలు.. 
వచ్చే 20 ఏళ్లలో మామునూరు విమానాశ్రయం తెలంగాణలో ఒక ముఖ్యమైన విమానయాన కేంద్రంగా మారడంతోపాటు.. వరంగల్, సమీప ప్రాంతాల్లో పెట్టుబడులను పెంచుతుంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, మద్రాస్‌ మహానగరాల్లో ఉన్న కంపెనీలు తమ బ్రాంచీలను ఏర్పాటు చేసేందుకు ఉపయోగంగా ఉంటుంది. మహానగరాలతో పోల్చుకుంటే లివింగ్‌ కాస్ట్‌ ఇక్కడ తక్కువగా ఉండడం వల్ల ఐటీ ఉద్యోగులు ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉంటాయి. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ వరంగల్‌ పట్టణం కంటే చిన్నది. 

అయినప్పటికి అక్కడ ఎయిర్‌పోర్టు ఉండడం వల్ల పట్టణానికి చుట్టూ స్పిన్నింగ్‌ మిల్లులు ఏర్పాటయ్యాయి. అదే విధంగా ముంబై, గుజరాత్, కోల్‌కతా, కోయంబత్తూరు లాంటి నగరాలకు చెందిన వస్త్ర పరిశ్రమలకు చెందిన వారు ఇక్కడ ఇండస్ట్రీలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. వరంగల్‌ చారిత్రాత్మకంగా గుర్తింపు పొందడంతోపాటు రామప్ప, మేడారం, లక్నవరం, తాడ్వాయి అభయారణ్యం ఉన్నందున టూరిజం పెరుగుతుంది. దేశ విదేశాలకు చెందిన పర్యా టకులు ఇక్కడకు వచ్చి సందర్శించే అవకాశాలు ఉన్నాయి. 

ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాలకు చెందిన వేలాది మంది స్థానికులు విద్య, ఉద్యోగాల పరంగా అనేక దేశాల్లో ఉంటున్నారు. వారు తక్కువ సమయంలో వచ్చివెళ్లేందుకు ఎయిర్‌పోర్టు ఎంతో ఉప యోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా హోట ళ్లు, ఇతర సంస్థలు ఏర్పాటు కావడం వల్ల స్థానిక యువతకు ఉపాధి లభిస్తుంది.‡ వరంగల్‌ కాటన్, చిల్లీస్‌కు గుర్తింపు పొందినందున ఎయిర్‌పోర్టు ఉంటే ఫుడ్‌ ఆధారిత కంపెనీలు ఏర్పాటు అయ్యే అవకాశాలు ఉన్నాయి.

మామునూరు ఎయిర్‌పోర్టుతో మహర్దశ
హైదరాబాద్‌ తర్వాత వరంగల్‌లో ఐటీ సెక్టార్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ముందుకు వస్తున్నందున పలు కంపెనీలు తమ యూనిట్లను ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ఎయిర్‌పోర్టు ప్రారంభమైతే ఎంతో బిజీగా ఉండే ప్రముఖ అంతర్జాతీయ కంపెనీల సీఈవోలు, ఇంటర్నేషనల్‌ సెక్టార్లకు చెందిన సీఈవోలు వచ్చి పోయేందుకు అనుకూలం. అందువల్ల ఇక్కడ కంపెనీలు పెట్టే అవకాశాలు ఉంటాయి. 

వరంగల్‌ కాటన్, చిల్లీస్‌కు గుర్తింపు పొందినందున ఎయిర్‌పోర్టు ఉంటే ఫుడ్‌ ఆధారిత కంపెనీలు ఏర్పాటు అయ్యే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా వ్యవసాయ ఉత్పత్తులు, గ్రానైట్‌ తదితర ఉత్పత్తులు అంతర్జాతీయంగా ఎగుమతులు అయ్యేందుకు అవకాశాలు కూడా ఉన్నాయి. – బొమ్మినేని రవీందర్‌రెడ్డి, అధ్యక్షుడు, వరంగల్‌ కామర్స్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ, తెలంగాణ రాష్ట్ర కాటన్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌

మెడికల్‌ ఎమర్జెన్సీ, పరిశోధనలకు అవకాశం..
వరంగల్‌లో ఎయిర్‌పోర్ట్‌ రాకతో విద్యార్థులకు ఏరోనాటి కల్‌ విభాగంలో నూతన ఆవిష్క రణ లకు, పరిశోధనలకు అనువై న అవకాశం లభిస్తుంది. వ్యాపా ర, వాణిజ్య, రియల్‌ ఎస్టేట్, టూరిజం రంగాల్లో మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి మెట్రోపాలిటన్‌ నగరాలకు వెళ్లేందుకు ప్రయాణసమయాన్ని ఆదా చేసుకోవచ్చు. విపత్తు, ఆపద సమయాల్లో మెడికల్‌ ఎమర్జెన్సీని త్వరితగతిన అందించవచ్చు. – పి.రామ్‌లాల్, ప్రొఫెసర్, ఎన్‌ఐటీ, వరంగల్‌

ఐటీ సంస్థలు ఎక్కువగా వస్తాయి..
మామునూర్‌కు ఎయిర్‌ పోర్టు రావడం వల్ల ఐటీ సంస్థలు వరంగల్‌కు రావ డానికి అవకాశం ఉంది. దీంతో జిల్లాలోని నిరు ద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరగ నున్నాయి. గతంలోకన్నా ఎక్కువగా ఐటీ సంస్థలు రావడానికి అవకాశాలు పెరగ నున్నాయి. వరంగల్‌ ఉమ్మడి జిల్లా యువ కులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. – దార ధనుంజయ్, ఐటీ ఉద్యోగి, మడికొండ, గ్రేటర్‌ వరంగల్‌

నిట్‌ ‘దాసా’ విద్యార్థులకు ప్రయాణం ఈజీ..
ఎన్‌ఐటీ వరంగల్‌లో విద్యనభ్యసిస్తున్న డైరెక్ట్‌ అడ్మిషన్‌ ఆఫ్‌ స్టూడెంట్స్‌ అబ్రోడ్‌ స్కీం (దాసా) విద్యార్థులు తమ గమ్యాన్ని చేరేందుకు మంచి అవకాశం. హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లకుండా మామునూర్‌లో ప్రారంభమయ్యే విమానాశ్రయం నుంచి ప్రయాణ అవకాశం పొందవచ్చు. వరంగల్‌ నగరాన్ని ఆర్థికంగా ఉన్నతస్థాయిలోకి చేర్చేందుకు ఉపయోగపడుతుంది. యువత ఉపాధికల్పనకు తోడ్పడుతుంది. – మహ్మద్‌ శార్‌జిల్, ఎంబీఏ విద్యార్ధి, ఎన్‌ఐటీ, వరంగల్‌

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)