Breaking News

వివేకా కేసు.. వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి ఎస్కార్ట్‌ బెయిల్‌

Published on Wed, 09/20/2023 - 18:11

సాక్షి, హైదరాబాద్‌:  మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్‌ భాస్కర్ రెడ్డికి బెయిల్‌ లభించింది. అనారోగ్య కారణాల దృష్ట్యా బెయిల్‌ ఇవ్వాలని ఆయన సీబీఐ కోర్టును ఆశ్రయించారు.  ఈ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న సీబీఐ కోర్టు.. సెప్టెంబర్‌ 22వ తేదీ నుంచి అక్టోబర్‌ 3వ తేదీ వరకు 12 రోజులపాటు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేస్తూ బుధవారం ఆదేశాలు ఇచ్చింది.

ఎస్కార్ట్‌ బెయిల్‌లో భాగంగా ముగ్గురు పోలీసులు, ఒక పోలీస్‌ వెహికిల్‌ ఉంటాయి. ఎస్కార్ట్‌ బెయిల్‌లో వీళ్లు భాస్కర్‌ రెడ్డి వెంటే ఉంటారు. ఇదిలా ఉంటే వివేకా హత్య కేసులో.. ఈ ఏప్రిల్‌లో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డిని పులివెందులలో విచారించి.. నాటకీయ పరిణామాల నడుమ అదుపులోకి తీసుకున్నారు తెలంగాణ సీబీఐ అధికారులు.  అప్పటి నుంచి ఆయన చంచల్‌గూడ జైల్లో ఉన్నారు.

మధ్యంతర బెయిల్‌ కోరుతూ ఆయన పిటిషన్‌ వేయగా.. ఇవాళ ఎస్కార్ట్‌ బెయిల్‌ మంజూరు చేసింది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం. అంతకు ముందు ఉదయ్‌ కుమార్‌రెడ్డికి కూడా సీబీఐ కోర్టు ఎస్కార్ట్‌ బెయిల్‌ మంజూరు చేసింది. ఉదయ్‌ భార్య గర్భవతిగా ఉండడంతో ఆమెను కలిసేందుకు 14 నుంచి 16వ తేదీ వరకు ఎస్కార్ట్‌ బెయిల్‌ మంజూరు చేసింది. 

ఇదీ చదవండి: Viveka Caseలో దారి తప్పిన 'సీబీఐ దర్యాప్తు'

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి