Breaking News

పెళ్లికి పిలుస్తలేరు.. చావుకు చెప్తలేరు!

Published on Fri, 02/16/2024 - 04:35

మానకొండూర్‌ రూరల్‌:  ఊరిలో ఆ కులానివి దాదాపు 50 గడపలు. శుభకార్యమైనా.. అశుభ కార్యమైనా అందరూ కలసికట్టుగా హాజరవుతారు. అయితే పంచాయితీ పెద్దలు చెప్పినట్లు వినలేదని, వారి తీర్పును తిరస్కరించారని కులం నుంచి ఓ కుటుంబాన్ని బహిష్కరించారు. ఏడాదికాలంగా గ్రామంలో పెళ్లయినా, చావైనా వీరిని పిలవడంలేదు.

బాధిత కుటుంబం కథనం ప్రకారం.. కరీంనగర్‌ జిల్లా మానకొండూర్‌ మండలం లింగాపూర్‌ గ్రామానికి చెందిన మాదాసు సంపత్‌ కుటుంబానికి ఊరిలో వారసత్వంగా వచ్చిన 1.03 ఎకరాల వ్యవసాయ భూమి అతని తండ్రి కొమురయ్య పేరున ఉంది. 2014లో సంపత్‌ తండ్రి కొమురయ్య మరణించాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన అడప శ్రీనివాస్‌ ఆ భూమి విషయంలో సంపత్‌తో గొడవకు దిగాడు. స్థానిక కోర్టుకు వెళ్లడంతో తీర్పు సంపత్‌కు అనుకూలంగా వచ్చింది. దీంతో తమ భూమిని సాగు చేసేందుకు అతను వెళ్లాడు. అయితే.. 

అడప శ్రీనివాస్, సంపత్‌ను అడ్డుకుని.. దాడి చేశాడు. గొడవ పెద్దది కావడంతో ఇరువురూ పోలీసుస్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. ఈ విషయమై ఇద్దరూ ఏడాది క్రితం గ్రామంలోని పంచాయితీ పెద్దలను ఆశ్రయించారు. వారు ఇరువర్గాలు రూ.50 వేలు డిపాజిట్‌ పెట్టాలని సూచించారు. సంపత్‌ తనవద్ద అంతమొత్తం లేవని, రూ.5 వేలు మాత్రమే ఇచ్చాడు. దీంతో తాము చెప్పినట్లు వినలేదని పంచాయితీ పెద్దలు సంపత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటినుంచి వారి కుటుంబాన్ని కులం నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.

గ్రామంలోని తమ కులస్తులు ఏడాదికాలంగా తమను ఎలాంటి కార్యాలకు పిలవకపోవడంతో మనోవేదనకు గురవుతున్నట్లు సంపత్‌ కుటుంబం వెల్లడించింది. కుల బహిష్కరణ చేసిన 11 మంది పంచాయితీ పెద్దలపై చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలని ఆయన ఇటీవల సీపీ కార్యాలయంలోనూ ఫిర్యాదు చేశాడు. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)