Breaking News

నగరాన్ని తలదన్నేలా మునిపల్లి..

Published on Fri, 02/14/2025 - 04:48

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: నగరాలు, పెద్ద పట్టణాల్లో గేటెడ్‌ కమ్యూనిటీ సంస్కృతి ఎక్కువగా కనిపిస్తోంది. కానీ నిజామాబాద్‌ జిల్లాలోని జక్రాన్‌ పల్లి మండలం (Jakranpally Mandal) మునిపల్లి (Munipally) గ్రామం గేటెడ్‌ కమ్యూనిటీ వాతావరణాన్ని తలపిస్తోంది. గ్రామంలోని ప్రధానమైన ప్రాంతంలో వెళ్తున్నప్పుడు.. నగరంలో ఉన్నామన్న భావన కలుగుతుంది. ఇక్కడ ప్రతి వీధికి నంబర్లు కేటాయించి బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రధాన, అంతర్గత రోడ్లన్నీ తారురోడ్లుగా వేశారు. రోడ్లన్నిటినీ పరిశుభ్రంగా ఉంచుతున్నారు. 

మొక్కలు, చెట్ల పెంపకం, నిర్వహణ ఆకట్టుకుంటోంది. గ్రామంలో భవనాలను నగరాల మాదిరిగా మంచి ఆర్కిటెక్చర్‌తో నిర్మించడం విశేషం. చాలా ఇళ్లకు సౌర విద్యుత్‌ (Solar Power) కంచెను ఏర్పాటు చేసుకు న్నారు. రైతులు సొంతంగా తమ సంఘం కోసం భారీ భవనం నిర్మించుకున్నారు. 

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో షాపింగ్‌ కాంప్లెక్స్‌ (Shopping Complex) నిర్మించి అద్దెలకు ఇచ్చారు. గ్రామంలో అన్నీ రైతు కుటుంబాలే అయినప్పటికీ.. పిల్లలను ఉన్నత విద్య చదివిస్తున్నారు. ప్రధాన రహదారి నుంచి బాగా లోపలికి ఉన్న ఈ గ్రామం ఆద్యంతం గేటెడ్‌ కమ్యూనిటీని తలపిస్తూ ఆకట్టుకుంటోంది.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)