Breaking News

‘విజయ’ పాల ధరల సవరణ!

Published on Thu, 03/06/2025 - 04:15

సాక్షి, హైదరాబాద్‌: పాడిరైతును ప్రోత్సహించేందుకు విజయ డెయిరీ ప్రస్తుతం రైతులకు ఇస్తున్న ధరలను సవరించాలని నిర్ణయించింది. ఒక్కో లీటరు పాలపై రూ.3 వరకు పెంచాలని భావిస్తోంది. ఇప్పటికే మూడుసార్లు పాల ధరలను సవరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మార్కెట్‌లో లీటరు ఆవుపాల ధర ఇతర ప్రైవేట్, సహకార డెయిరీలతో పోలిస్తే విజయ డెయిరీ దాదాపు రూ.8 నుంచి రూ.9 ఎక్కువగా చెల్లిస్తోంది. 

రైతులను మరింత ప్రోత్సహించే దిశగా ఆవు పాలు లీటరుపై గరిష్టంగా రూ.3 వరకు పెంచేలా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీంతో లీటరు ఆవు పాల ధర రూ.42.24, గేదె పాలధర కూడా రూ.51.00 ఉండేలా అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు. ప్రస్తుతం ఈ పెంపు ప్రతిపాదనలు ప్రభుత్వం వద్దకు చేరినట్టు సమాచారం. 

రోజుకు 2.8 లక్షల లీటర్లు... 
పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర నుంచి అతి తక్కువ ధరకు పాలు తెలంగాణకు దిగుమతి అవుతున్నాయి. కొన్ని ప్రైవేట్‌ డెయిరీలు, కోఆపరేటివ్‌ రంగంలోని డెయిరీలు పక్క రాష్ట్రాల నుంచి లీటర్‌కు రూ. 27 నుంచి రూ.32 చొప్పున ఆవుపాలను సేకరించి, మార్కెటింగ్‌ కమీషన్లను పెంచి మన రాష్ట్రంలో అమ్మకాలను పెంచుకుంటున్నాయి. దీని ప్రభావం విజయ డెయిరీ అమ్మకాలపై పడుతోంది. 

వీటితోపాటు విజయ పేరుతో కొన్ని డెయిరీలు అక్రమంగా అమ్మకాలు జరుపుతున్నాయి. ఈ సిబ్లింగ్‌ విజయ బ్రాండ్ల ద్వారా విజయ తెలంగాణ డెయిరీ పాల అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం రోజుకు విజయ బ్రాండ్‌ పాలు 2.8లక్షల లీటర్లు అమ్ముడు పోతున్నాయి. ఈ నేపథ్యంలో అమ్మకాలు పెంచే దిశగా కసరత్తు చేస్తున్న విజయ డెయిరీ.. పాడి రైతులందరికీ పాల బిల్లుల చెల్లింపులను వేగవంతం చేయడంతో పాటు ప్రోత్సహించే దిశగా ఈ మేరకు చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తోంది. 

తాజాగా విజయ డెయిరీ యంత్రాంగం సమావేశమై మూడు ప్రతిపాదనలు రూపొందించినట్టు సమాచారం. దాదాపు రూ.50 కోట్ల పాత బకాయిల చెల్లింపు కోసం ప్రభుత్వాన్ని కోరనున్నట్లు తెలుస్తోంది. ప్రతి నెలా 5 నుంచి 20వ తేదీ మధ్య పాల బిల్లులు చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)